Share News

టీచర్లు కావాలంటూ రోడ్డుపై బైఠాయింపు

ABN , Publish Date - Sep 21 , 2026 | 11:53 PM

బోధించేందుకు టీ చర్లు కావాలంటూ విద్యార్థులు రోడ్డెక్కారు.

టీచర్లు కావాలంటూ రోడ్డుపై బైఠాయింపు
రాజపేటలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేస్తున్న విద్యార్థులు

- పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచి ఇంగ్లీష్‌ టీచర్‌ లేరు

- రాస్తారోకో చేపట్టిన విద్యార్థులు

వనపర్తి రూరల్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : బోధించేందుకు టీ చర్లు కావాలంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. వనపర్తి మండల పరిధిలోని రాజపేట ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌ సబ్జెక్టు టీచర్‌ లేకపోవడంతో వి ద్యార్థులు సోమవారం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. అదే గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి నుంచి ప దవ తరగతి వరకు 120మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాల ప్రారం భమైనప్పుడు ఫిజికల్‌ సైన్స్‌ ఇంగ్లీష్‌ సబ్జెక్టుల పోస్టులు ఖాళీగా ఉన్నా యి. పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచి రెండు సబ్జెక్టులకు టీచర్లు లేకపోవడంతో పాఠశాల ప్రారంభమైన మొదట్లో విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. అప్పట్లో పెబ్బేరు మండలంలోని ఓ గ్రామంలోని పాఠశాల నుంచి డిప్యూటేషన్‌ ఫిజికల్‌ సైన్స్‌ టీచర్‌ను పాఠశాలకు పంపారు. అప్పటి నుంచి ఇంగ్లీష్‌ సబ్జెక్టుకు టీచర్‌ లేరు. ఇదిలా ఉండగా డిప్యూటేషన్‌పై వచ్చిన ఫిజికల్‌ సైన్స్‌ టీచర్‌ను మళ్లీ తిరిగి పాత పాఠశాలకే రావాలని సంబంధిత ఎం ఈవో ఫిజికల్‌ సైన్స్‌ టీచర్‌ వాట్సాప్‌కు మేసేజ్‌ పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచి ఇంగ్లీష్‌ సబ్జెక్టు టీచర్‌ లేక సబ్జెక్టుపైన పట్టు సాధించలేకపోతున్నామని, ఇప్పుడు తిరిగి ఫిజికల్‌ సైన్స్‌ టీచర్‌ వెళ్లిపోతే రెండు సబ్జెక్టులపైన ఉత్తీర్ణత సా ధించేది కష్టమేనని నిరసనతోపాటు రాస్తారోకో చేశారు. విద్యార్థులు రా స్తా రోకో చేయడంతో ఎక్కడి బస్సులు అక్కడ నిలిచిపోయాయి. విష యం తెలుసుకున్న డీఈవో ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో స మస్యలు అడిగి తెలుసుకున్నారు. రెండు సబ్జెక్టులపైన ఇబ్బంది కలుగ కుండా ఫిజికల్‌ సైన్స్‌, ఇంగ్లీష్‌ టీచర్లను డిప్యూటేషన్‌పై పంపిస్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు.

Updated Date - Sep 21 , 2026 | 11:53 PM