ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం స్థల పరిశీలన
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:23 PM
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని రూ.200 కోట్లతో చేపట్టనున్నట్లు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ప్రకటించారు.
రూ.200 కోట్లతో నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటన
గద్వాల, జనవరి 8(ఆంధ్రజ్యోతి): యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని రూ.200 కోట్లతో చేపట్టనున్నట్లు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ప్రకటించారు. గురువారం జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండల కేంద్రంలో ఆయన స్కూల్ నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటి గ్రేటెడ్ స్కూల్ అందుబాటులోకి వస్తే నియోజకవర్గంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు హాస్టల్ సౌకర్యం, ఆంగ్ల విద్యాబోధన లభిస్తుందని తెలిపారు. విద్యార్థులకు ఆహ్లాదకరమైన ప్రదేశంలో పాఠశాల నిర్మాణం చేపడుతామని తెలిపారు. ప్రతీ ఒక్కవిద్యార్థి ఉన్నత చ దువులు చదువుకొని అత్యున్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ కురువ హనుమంతు, మాజీ ఎంపీపీ విజయ్‌కుమార్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్, సర్పంచు నారాయణ, నాయకులు రమేశ్‌నాయుడు, విక్రమసింహారెడ్డి, ఉరుకుందు, ఆంజనేయులు, మల్లేశ్‌గౌడ్ పాల్గొన్నారు.