Share News

ఓటర్లకు ఇబ్బంది కలుగకుండా ఎస్‌ఐఆర్‌

ABN , Publish Date - Oct 01 , 2026 | 11:26 PM

ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా ఎస్‌ఐఅర్‌ ప్రక్రియను నిర్వహిం చాలని నారాయణపేట కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక అధికా రులను ఆదేశించారు.

ఓటర్లకు ఇబ్బంది కలుగకుండా ఎస్‌ఐఆర్‌
మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ ప్రియాంక

- వారి ఇళ్ల వద్దకే నోటీసులు, అక్కడే పత్రాల స్వీకరణ

- నారాయణపేట కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక

నారాయణపేట, ఆక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) : ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా ఎస్‌ఐఅర్‌ ప్రక్రియను నిర్వహిం చాలని నారాయణపేట కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక అధికారులను ఆదేశించారు. ఓటర్ల ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇవ్వా లని, అవసరమైన పత్రాలను స్వీకరించాలని సూచించారు. ఎస్‌ఐఅర్‌, 2026 - గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటరు నమో దు తదితర అంశాలపై ఎన్నికల ముఖ్య అధికారి సుదర్శ న్‌రెడ్డి గురువారం సాయంత్రం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నారాయణ పేట కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌ నుంచి కలె క్టర్‌ పాల్గొన్నారు. అనంతరం అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. కొత్త ఓటరు నమోదు కోసం పారం - 6 సమర్పించే సమయంలో తప్పని సరిగా డిక్షరేషన్‌ తీ సుకోవాలని సూచించారు. ఈనెల 31 నాటికి గ్రాడ్యు యేషన్‌ పూర్తి చేసిన వారిని ఓటరుగా నమోదు చేసుకో వాలన్నారు.. సమావేశంలో సీ సెక్షన్‌ అధికారి జయసుధ, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2026 | 11:26 PM