సర్ ప్రక్రియను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Jul 19 , 2026 | 11:24 PM
సర్ ప్రక్రియను అన్ని డివిజన్లలో వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు.
- కార్పొరేటర్‌కు ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి దిశా నిర్దేశం
మహబూబ్‌నగర్, జూలై 19 (ఆంధ్రజ్యోతి) : సర్ ప్రక్రియను అన్ని డివిజన్లలో వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు. అన్ని డివిజన్లలో ఓటర్లకు సర్ పత్రాలు అందాయా? నింపడంలో ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుని వారికి స హకరించాలన్నారు. ఆదివారం రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లతో సమావే శం నిర్వహించారు. నింపిన పత్రాలు బీఎల్‌వోలకు అందజేసి వాటిని అప్‌లోడ్ చేయించే బాధ్యత మనదేనన్నారు. అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగిపోవడానికి వీలులేదని, జాగత్త్రగా చూ సుకోవాలన్నారు. పూర్తి స్థాయిలో వందశాతం సర్ జరగాలన్నారు. కా ర్యక్రమంలో మేయర్ మమత, డిప్యూటీ మే యర్ సురేందర్‌రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, నాయకులు రాములురాయవ్, అ జ్మత్‌అలీ, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఇంటింటికీ కాంగ్రెస్.. సర్‌పై అవగాహన
మిడ్జిల్ : మండలంలోని అయ్యవారిపల్లిలో ఆదివారం కాంగ్రెస్ నాయకులు ఇంటింటికీ వెళ్లి ఎస్‌ఐఆర్‌పై గ్రామస్థులకు అవగాహన కల్పించా రు. ఎన్యుమరేషన్ నిర్వహించే ప్రక్రియ, ఓటు హక్కు ప్రాముఖ్యత, ఓటరు జాబితాలో వివరా ల నమోదుపై ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు చుక్కయ్య, వార్డు సభ్యులు శ్రీను, గోపాల్, మాసయ్య, వెంకట్‌రెడ్డి, శ్రీకాంత్, బీఎల్‌వో ఆంజనేయులు, యూత్ కాంగ్రెస్ అధ్య క్షుడు శివాజీ పాల్గొన్నారు.