సర్ ప్రక్రియను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Jul 17 , 2026 | 11:49 PM
ఓట రు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను వేగవం తం చేయాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ ఆదే శించారు.
గద్వాల టౌన్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ఓట రు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను వేగవం తం చేయాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ ఆదే శించారు. పట్టణంలో చేపట్టిన సర్ ప్రక్రియను శుక్రవారం 16వ వార్డు పరిధి భీమ్‌నగర్‌లో క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఓటర్లు వివరాలు పూ రించిన ఎన్యూమరేషన్ పత్రాలను త్వరగా సేక రించే డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాల న్నారు. ఓటరు జాబితాలో తప్పిదాలు లేకుండా చేయడమే లక్ష్యమని, ఆ దిశగా బీఎల్‌వోలు పక డ్బందీగా విధులు నిర్వహించాలన్నారు. కార్యక్ర మంలో గద్వాల తహసీల్దార్ హరికృష్ణ, ఎన్నిక ల డీటీ ఉదయ్‌కిరణ్, ఆర్‌ఐ వెంకటేశ్వర్‌రెడ్డి, బీ ఎల్‌వో సునీత ఉన్నారు. అనంతరం పట్టణంలో ని ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలను తని ఖీ చేశారు. డిగ్రీ విద్యార్థులు బోధిస్తున్న కంప్యూ టర్, ఏఐటెక్నాలజీ తరగతులను పరిశీలించారు.