సర్ ఒక బాధ్యత
ABN , Publish Date - Jul 22 , 2026 | 11:18 PM
ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను రాజకీయ పార్టీలు ఒక బాధ్యతగా స్వీకరించి వేగ వంతం చేయాలని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.
- మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి రూరల్, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను రాజకీయ పార్టీలు ఒక బాధ్యతగా స్వీకరించి వేగ వంతం చేయాలని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం వన పర్తి మండలంలోని అచ్చుతాపురం, రాజానగరం గ్రామాల్లో సర్ ప్రక్రియ ను ఆయన పరిశీలించారు. వనపర్తి పట్టణంలో డిజిటలైజేషన్ 57శాతం మాత్రమే పూర్తైందని, అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వేగవంతం చేయాలని సూచించారు. నియోజకవర్గంలో ఓటరు జాబితా సవరణ ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఆయన వెంట గట్టుయాదవ్, శ్రీధర్, రమేష్‌గౌడ్ తదితరులు ఉన్నారు.