Share News

దేశ రాజకీయ పరిస్థితులను మార్చేందుకే ఎస్‌ఐఆర్‌

ABN , Publish Date - Jul 03 , 2026 | 11:42 PM

దేశ రాజకీయ పరిస్థితులను మా ర్చేందుకే స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ను ప్రవే శపెడతారని రాజకీయ ఆర్థిక శాస్త్రవేత్త పరకా ల ప్రభాకర్‌ విమర్శించారు.

 దేశ రాజకీయ పరిస్థితులను మార్చేందుకే ఎస్‌ఐఆర్‌
ఎస్‌ఐఆర్‌ సదస్సులో మాట్లాడుతున్న రాజకీయ ఆర్థిక శాస్త్రవేత్త పరకాల ప్రభాకర్‌

- రాజకీయ ఆర్థిక శాస్త్రవేత్త పరకాల ప్రభాకర్‌

మహబూబ్‌నగర్‌ టౌన్‌, జూలై 3 (ఆం ధ్రజ్యోతి): దేశ రాజకీయ పరిస్థితులను మా ర్చేందుకే స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ను ప్రవే శపెడతారని రాజకీయ ఆర్థిక శాస్త్రవేత్త పరకా ల ప్రభాకర్‌ విమర్శించారు. శుక్రవారం స్థానిక పారిశ్రామికవాడలోని సీనియర్‌ సిటిజన్‌ ఫో రం కార్యాలయంలో సీనియర్‌ సిటిజన్‌ ఫోరం, పాలమూరు అధ్యయన వేదిక సంయుక్త ఆ ధ్వర్యంలో ఎస్‌ఐఆర్‌పై నిర్వహించిన సదస్సు లో ఆయన ప్రొఫెసర్‌ హరగోపాల్‌తో కలిసి హాజరై ప్రసంగించారు. ఈ ప్రక్రియ గత ఓట ర్ల జాబితా సవరణల వంటిది కాదని, ఇది దేశ మూలాలను కదిలిస్తుందని అన్నారు. ని జంగానే ఎస్‌ఐఆర్‌ జరపడంలో స్వచ్ఛత ఉం టే చొరబాటు దారుల సమస్య అస్సాంకు మా త్రమే పరిమితం అయ్యిందని, అక్కడ ఇప్పు డు ఎస్‌ఐఆర్‌ను ఎందుకు జరపడం లేదని ఆ యన ప్రశ్నించా రు. ఎన్నికల కమి షన్‌ ఓటర్లకు చెప్పకుం డా ఓట్లను తొలిగిస్తుంద న్నారు. తొలిగించిన ఓట్ల తోనే ఫలితాలను తారు మారు చేస్తుందని ఆయ న ఆరోపించారు. బీహార్‌ లో 80లక్షలు , బెంగాల్‌ లో 90 లక్షలు, తమిళనా డులో 97లక్షలు, యూపీ లో ఏకంగా 2.63కోట్ల ఓటర్లను తొలిగించినా ఎవ్వరు మాట్లాడక పోవడం దారుణమన్నా రు. ఉద్ధేశపూర్వకంగానే ముస్లిం, క్రైస్తవ, మై నార్టీలతో పాటు ఆదివాసీ, దళితులు, పేదల ఓట్లను తొలగిస్తున్నారని ఆయన దుయ్యబట్టా రు. ప్రజలు పార్టీలలో, ప్రభుత్వాలను నమ్మ డం కాకుండా వీధుల్లోకి వచ్చి పోరాడి ఎస్‌ఐ ఆర్‌ను నిలువరించాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ ఆర్థిక, విద్య, సామాజిక అంతరాలు ఉన్న ఈ దేశంలో వాటిని వదిలేసి ఇప్పుడు ఎస్‌ఐఆర్‌ ఎందుకని ప్రశ్నించారు. ఫోరం అధ్యక్షుడు జ గపతిరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావే శంలో తిమ్మప్ప, హానిఫ్‌ అహ్మెద్‌, బెక్కెం జరనార్థన్‌, రాఘవాచారి, కేసీ వెంకటేశ్వర్లు ప్రసంగించారు.

Updated Date - Jul 03 , 2026 | 11:42 PM