భూవివాదంలో తలదూర్చిన ఎస్‌ఐ
ABN , Publish Date - Apr 08 , 2026 | 11:15 PM
నారాయణపేట జిల్లా మక్తల్ మునిసిపాలిటీ పరిధిలోని గార్లపల్లి గ్రామంలో ఓ భూ వివాధంలో తలదూర్చిన ఎస్‌ఐ భాగ్యలక్ష్మీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్థులు పట్టణంలోని అంబేడ్కర్‌చౌరస్తాలో రాస్తారోకో నిర్వ హించారు.
- చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల ఆందోళన
మక్తల్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి) : నారాయణపేట జిల్లా మక్తల్ మునిసిపాలిటీ పరిధిలోని గార్లపల్లి గ్రామంలో ఓ భూ వివాధంలో తలదూర్చిన ఎస్‌ఐ భాగ్యలక్ష్మీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్థులు పట్టణంలోని అంబేడ్కర్‌చౌరస్తాలో రాస్తారోకో నిర్వ హించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గార్లపల్లి ఆర్‌ఆర్ సెం టర్‌లో 24ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందన్నారు. గ్రామా నికి చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వ భూమి కబ్జా చేయడంతో ఈ విష యంపై తహసీల్దార్, కమిషనరన్‌కు వినతిపత్రం అందించామన్నారు. గ్రామస్థులు ఏకమై ఊర లక్ష్మమ్మ ఆలయం నిర్మించాలని ప్రయత్నిస్తే అధికార పార్టీకి చెందిన మాజీ జడ్పీటీసీ కబ్జా చేసిన వ్యక్తికి అండగా నిలబడుతున్నాడన్నారు. ఈ విషయంపై ఎస్‌ఐకి ఫిర్యాదు చేస్తే గ్రామా నికి వచ్చి భూ వివాదంలో ప్రజలను బెదిరిస్తున్నారన్నారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన సదరు వ్యక్తి, ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ సతీష్‌కుమార్‌కు వినతి పత్రం అందించారు.