రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీలో ప్రతిభ చాటాలి
ABN , Publish Date - Nov 01 , 2026 | 11:37 PM
రాష్ట్రస్థాయి టోర్నీలో ప్రతిభ చాటాలని ఎస్‌జీఎఫ్ సెక్రటరీ వేణుగోపాల్ అన్నారు.
- ఎస్‌జీఎఫ్ సెక్రటరీ వేణుగోపాల్
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రస్థాయి టోర్నీలో ప్రతిభ చాటాలని ఎస్‌జీఎఫ్ సెక్రటరీ వేణుగోపాల్ అన్నారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆ ధ్వర్యంలో నగరంలోని బాలుర కళాశాల మై దానంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండ ర్-19 బాలురు క్రికెట్ పోటీలను ఆదివారం రెండో రోజు టోర్నీ పరిశీలకుడు విజయ్‌కు మార్‌తో కలిసి ప్రారంభించారు. వారు మా ట్లాడుతూ క్రమఽశిక్షణ ఉంటే క్రీడల్లో రా ణిస్తారని, టోర్నీలో ప్రతిభ చాటి జాతీ యస్థాయి టోర్నీలో పాల్గొనే రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకోవాల న్నారు. కార్యక్రమంలో బాలరాజు, శ్రీనివాసు లు, అబ్దుల్లా, రాఘ వేందర్ కిరణ్, శ్రీనివా స్‌రెడ్డి, సోహెల్, మో యిన్, రామ్మోహన్, వినోద్ తదితరులు పా ల్గొన్నారు.
42 పరుగుల తేడాతో గెలిచిన మహబూబ్‌నగర్
టోర్నీ రసవత్తంగా కొనసాగుతుంది. ఆది వారం అల్లీపూర్ స్టేడియం జరిగిన మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు నల్గొండపై 42 పరు గుల తేడా విజయం సాధించింది. టాస్ గెలి చి మొదట బ్యాటింగ్ చేసిన మహబూ బ్‌నగర్ జట్టు 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. జట్టులో బీరేందర్ అ ర్ధసెంచరీ(50)తో రాణించగా, రామ్‌చెర్రి 35 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ దిగి న నల్గొండ జట్టు 12 ఓవర్లలో 62 పరుగులు చేసి ఓటమిపాలైంది. జిల్లా బౌలర్ ఫైజన్ 5 వికెట్లు తీసి జట్టు విజయానికి కృషి చేశాడు. వరంగల్‌పై హైదరాబాద్ జట్టు గెలు పొందింది. హైదరాబాద్ జట్టు 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. జ ట్టులో ధృవ్‌రెడ్డి 97, చాణక్య 35 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వరం గల్ జట్టు 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసి ఓడిపోయింది. జట్టులో ఫ్రీతమ్ 37, అభినవ్ 33 పరుగులు చేశారు. ఆదిలాబాద్ జట్టు నిజామాబాద్‌పై, మెదక్ జ ట్టు రంగారెడ్డిపై, కరీంనగర్ జట్టు నిజామా బాద్‌పై, రంగారెడ్డి జట్టు నిజామాబాద్‌పై గెలుపొందాయి.