Share News

పోలీసు శాఖ సేవలపై లఘుచిత్రం, ఫొటోగ్రఫీ పోటీలు

ABN , Publish Date - Oct 06 , 2026 | 11:52 PM

జిల్లాలో పోలీసు ప్లాగ్‌ డే అక్టోబరు 21 సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో 3 నిమిషాల లఘుచిత్రం(షార్ట్‌ ఫిల్మ్‌), ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నట్లు జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

పోలీసు శాఖ సేవలపై లఘుచిత్రం, ఫొటోగ్రఫీ పోటీలు

  • ఎస్పీ శ్రీనివాసరావు

గద్వాల క్రైం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పోలీసు ప్లాగ్‌ డే (అమరవీరుల స్మార క వారోత్సవాలు) అక్టోబరు 21 సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో 3 నిమిషాల లఘుచిత్రం(షార్ట్‌ ఫిల్మ్‌), ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నట్లు జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు, సృజనాత్మక ప్రతిభ క లిగిన వారు పోలీసు శాఖ విధులు, ప్రజలకు అందిస్తున్న సేవలు, పోలీసు-ప్రజల స్నేహపూర్వక సంబంధాలు, అమరవీరుల త్యాగాలు, మ హిళలు, పిల్లల భద్రత, ట్రాఫిక్‌, రోడ్డు భద్రత, నేర నియంత్రణ, సామాజిక అవగాహన కార్యక్రమాలు తదితర పోలీసు అంశాలను ప్రతిబింబించేలా లఘుచిత్రాలు, ఛాయాచిత్రాలను రూ పొందించవచ్చని, ఈనెల 23వ తేదీలోపు జిల్లా పోలీసు కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. జిల్లాస్థాయిలో న్యాయనిర్ణేతల ద్వారా ప్రతిభ కనబరిచిన మూడు లఘుచిత్రాలు, మూడు ఉత్తమ ఛాయాచిత్రాలను ఎంపిక చేసి విజేతలకు బహుమతులను, ప్రశంసాపత్రాల ను అందజేస్తామని తెలిపారు.

Updated Date - Oct 06 , 2026 | 11:52 PM