ముగిసిన ఎస్‌జీఎఫ్ జిల్లాస్థాయి పోటీలు
ABN , Publish Date - Sep 30 , 2026 | 10:59 PM
నారాయణపేట జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ జిల్లాస్థాయి పోటీలు ముగిశాయి.
నారాయణపేట రూరల్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ జిల్లాస్థాయి పోటీలు ముగిశాయి. బుధవా రం కబడ్డీ పోటీలను జిల్లా యువజన క్రీడా అధికారి వెంకటేశ్, జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించి, క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ విద్యార్థులు తమ చేతిలో ఉన్న సెల్‌ఫోన్ దూరం చేసుకుని మైదానాల్లో క్రీడల కోసం సమయాన్ని కేటాయించాలన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. పీఈటీలు జి.నర్సిములు, రత్నయ్య, వెంకటప్ప, సాయినాథ్, అనంతసేన, నర్సింహారెడ్డి, కతలప్ప, వెంకటేష్ తదితరులున్నారు.