శేషాద్రి ఆశయాలను కొనసాగించాలి
ABN , Publish Date - Mar 08 , 2026 | 10:58 PM
శేషాద్రి విశ్వసించిన శాస్త్రీయ భావజాలాన్ని కొనసాగిస్తూ సమసమాజ నిర్మా ణానికి కృషి చేయడమే నిజమైన నివాళి అని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్‌రాజు అన్నా రు.
నారాయణపేట టౌన్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): శేషాద్రి విశ్వసించిన శాస్త్రీయ భావజాలాన్ని కొనసాగిస్తూ సమసమాజ నిర్మా ణానికి కృషి చేయడమే నిజమైన నివాళి అని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్‌రాజు అన్నా రు. స్థానిక ప్రభుత్వ హైస్కూల్‌లో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దేవేందర్ అధ్యక్షతన నిర్వహిం చిన శేషాద్రి సంతాప సభలో ఆయన మాట్లా డారు. స్వాతంత్య్రం అనంతరం గ్రామీణ ప్రాం తాల్లో విద్యావ్యాప్తి పరిమితంగా ఉన్న కాలం లోనే శేషాద్రి తన మేధస్సుతో గణితశాస్త్రంలో ప్రతిభ కనబరిచారన్నారు. ఈ విషయంపైనే ప రిమితం కాకుండా సమాజంలో రుగ్మతలను తొలగించేందుకు పరిష్కార మార్గాలను అన్వే షించిన వ్యక్తి అన్నారు. ఈ సందర్భంగా శేషాద్రి రాసిన రచనలు, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మిత్రులు రాసిన వ్యాసాల తో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్ర మంలో మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు మ హిమూద్, రెడ్డప్ప, నారాయణ, వెంకట్, యశ్వం త్, బాలాజీ, కాశీనాథ్, పాల్గొన్నారు.