Share News

పకడ్బందీగా జనాభా గణన రెండో దశ

ABN , Publish Date - Oct 17 , 2026 | 12:07 AM

జిల్లాలో జనాభా గణన రెండో దశను పకడ్బందీగా నిర్వహిం చేందుకు అధికారులు, సిబ్బంది నిర్దేశిత విధి విధానాలను పాటించాలని జన గణన రాష్ట్ర డెరెక్టర్‌ భారతి హోళికేరి సూ చించారు.

పకడ్బందీగా జనాభా గణన రెండో దశ
శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతున్న జనగణన రాష్ట్ర డైరెక్టర్‌ భారతి హోళికేరి

  • జన గణన రాష్ట్ర డెరెక్టర్‌ భారతి హోళికేరి

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో జనాభా గణన రెండో దశను పకడ్బందీగా నిర్వహిం చేందుకు అధికారులు, సిబ్బంది నిర్దేశిత విధి విధానాలను పాటించాలని జన గణన రాష్ట్ర డెరెక్టర్‌ భారతి హోళికేరి సూ చించారు. జనగణనపై మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో శుక్రవారం ప్రారంభించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్‌ ఖుష్బూగుప్తాతో కలిసి పాల్గొన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో జనాభా గణన రెండో దశలో చేట్టాల్సిన పనులు, అధికారుల బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భారతి హోళికేరి మాట్లాడుతూ జనాభా గణన ప్రక్రియలో తప్పిదాలకు తావులేకుండా, నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్త వహించాలని సూచించారు. అనంతరం ఛార్జ్‌ క్లర్కులు, టెక్నికల్‌ అసిస్టెంట్లకు హైదరాబాద్‌ నుంచి వచ్చిన శిక్షకులు దయానందం, శివరామకృష్ణ శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్‌ ప్రిన్సిపల్‌ సెన్సస్‌ అధికారి, అదనపు కలెక్టర్‌ జేఎల్‌బీ హరిప్రియ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాయి శివాని, జనగణన జిల్లా అధికారి బి. నర్సింములు పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2026 | 12:07 AM