నిమజ్జనానికి.. నీళ్లు కరువు
ABN , Publish Date - Sep 16 , 2026 | 11:50 PM
ఎల్‌నినో ప్రభావం సకల జీవరాశులపైనే కాకుండా ఆదిదేవుడైన గణనాథుడిపై పడుతోంది.
బీచుపల్లి వద్ద అడుగంటిన కృష్ణమ్మ..
ఎర్రవల్లి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం సకల జీవరాశులపైనే కాకుండా ఆదిదేవుడైన గణనాథుడిపై పడుతోంది. ప్రతీ ఏడాది గణనాథుల నిమజ్జనాలతో బీచుపల్లి కృష్ణానది కళకళలాడేది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షా లు కురవక వెలవెలబోయింది. దీంతో గణనాథుల నిమజ్జనానికి నీళ్లు కరువయ్యాయి. నిమజ్జనం వేళ కృష్ణానది నీటిమ ట్టం గణనీయంగా తగ్గిపోవడంతో భక్తులు గణపయ్యలను నిమజ్జనం చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. బీచుపల్లి వద్ద కృష్ణానదిలో వినాయకులను నిమజ్జనం చేసేందుకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు, హైదరాబాద్ నుంచి కూడా పెద్దపెద్ద విగ్రహాలను తీసుకువస్తుంటారు. నిమజ్జనానికి అవసరమైన నీటి లభ్యతపై అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారనే ఆశతో గణనాథుడి భక్తులు ఎదురుచూస్తున్నారు.