Share News

శక్తిపీఠాన్ని దర్శించుకున్న ఎస్‌బీఐ చైర్మన్‌

ABN , Publish Date - Nov 22 , 2026 | 11:30 PM

భారతీయ స్టేట్‌ బ్యాంకు చైర్మన్‌ సి.శ్రీనివాసులుశెట్టి ఆదివారం కుటుంబ సమేతంగా అలంపూర్‌ శ్రీజోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి వార్లను దర్శించుకున్నారు.

శక్తిపీఠాన్ని దర్శించుకున్న ఎస్‌బీఐ చైర్మన్‌
సెల్ఫ్‌ టికెటింగ్‌ యంత్రాన్ని ఈఓ దీప్తికి అందజేస్తున్న ఎస్‌బీఐ చైర్మన్‌ శ్రీనివాసులు శెట్టి

  • పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు

  • భక్తుల కోసం ఎలక్ట్రిక్‌ వాహనం, కియోస్క్‌ వితరణ

అలంపూర్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): భారతీయ స్టేట్‌ బ్యాంకు చైర్మన్‌ సి.శ్రీనివాసులుశెట్టి ఆదివారం కుటుంబ సమేతంగా అలంపూర్‌ శ్రీజోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి వార్లను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న చైర్మన్‌ దంపతులకు ఆలయ కార్యనిర్వహణ అధికారిదీప్తి, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజే శారు.

ఎలక్ట్రిక్‌ వాహనం వితరణ

ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఎస్‌బీఐ తరఫున 12 సీట్ల సామర్థ్యం గల ఎలక్ట్రిక్‌ వాహనాన్ని, అలాగే భక్తులు సులభంగా టికెట్లు తీసుకునేందుకు వీలుగా సెల్ఫ్‌ టికెటింగ్‌ సిస్టం (కియోస్కు) యంత్రాన్ని ఆలయ అధికారులకు బహూకరించారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎస్‌బీఐ చైర్మన్‌ సి.శ్రీనివాస్‌శెట్టి, శ్రీమతి శ్రీదేవి సూర్య దంపతులతో పాటు ఎస్‌బీఐ హైదరాబాద్‌ సర్కిల్‌ సీజీఎం నీలేష్‌ ద్వివేది, రష్మీద్వివేది, జీఎం వన్‌ రన్‌ విజయ్‌ప్రతాప్‌, జీఎం2 సతీశ్‌కుమార్‌, డీజీఎం (బీఅండ్‌ ఓ) ప్రియబ్రతామిశ్రా, ఆర్‌ఎం శ్రీచరణ్‌, అలంపూర్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ లక్ష్మీకాంత్‌రెడ్డి, ఇతర బ్యాంక్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2026 | 11:30 PM