Share News

సావిత్రిబాయి ఫూలే సేవలు మరువలేనివి

ABN , Publish Date - Jan 03 , 2026 | 11:25 PM

సావిత్రిబాయి ఫూలే సేవలు మరువలేనివని సీపీఎం జిల్లా కార్యదర్శి రాములు అన్నారు.

సావిత్రిబాయి ఫూలే సేవలు మరువలేనివి
పూలే చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న పీయూ వీసీ జీఎన్‌ శ్రీనివాస్‌

పాలమూరు/మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం/టౌన్‌/జడ్చర్ల/భూత్పూర్‌/మిడ్జిల్‌/బాలానగర్‌/రాజాపూర్‌/ హన్వాడ/నవాబ్‌పేట/చిన్నచింతకుంట/దేవరకద్ర, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : సావిత్రిబాయి ఫూలే సేవలు మరువలేనివని సీపీఎం జిల్లా కార్యదర్శి రాములు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దళిత బహుజన ప్రజా సంఘాలు తెలంగాణ చౌరస్తాలో, కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో షాషాబ్‌గుట్ట దగ్గర,బీసీ మేధావుల సంఘం ఆధ్వర్యంలో బీసీ స్టడీ సర్కిల్‌ దగ్గర, మాలమహానాడు ఆఽధ్వర్యంలో గడియారం చౌరస్తాలో ఫూలే చిత్రపటానికి నివాళి అర్పించారు. భారత మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి కొండికంటి పద్మావతి ఆధ్వర్యంలో సీపీఐ కార్యాలయం దగ్గర మహిళా సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే నివాళి అర్పించారు. మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదయ్య ఆధ్వర్యంలో గడియారం చౌరస్తాలో సావిత్రిబాయి ఫూలే విగ్రహానికి నివాళి అర్పించారు. బీసీటీఏ ఆధ్వర్వంలో రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు, జిల్లా అధ్యక్షుడు రాఘవేందర్‌, ప్రధాన కార్యదర్శి ధనుంజయ, మల్లేష్‌ పాత డీఈవో కార్యాలయంలోని సావిత్రిబాయి విగ్రహానికి నివాళి అర్పించారు. యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రవికుమార్‌, వెంకటేష్‌, ఉమాదేవి, జయంతి నివాళి అర్పించారు. వాగ్దేవి జూనియర్‌ కళాశాలలో కరస్పాండెంట్‌ విజేత వెంకట్‌రెడ్డి ఆమె చిత్రపటానికి నివాళి అర్పించారు. మాదిగ విశ్రాంత ఉద్యోగ మేధావుల సంఘం ఆధ్వర్యంలో టీఎన్‌జీవో హోమ్‌లో జిల్లా అధ్యక్షుడు విశ్రాంత తహసీల్దార్‌ చెన్నకిష్టన్న సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి నివాళి అర్పించారు. ఉపాధ్యక్షుడు రిటైర్డ్‌ తహసీల్దార్‌ చంద్రశేఖర్‌, ప్రధాన కార్యదర్శి రిటైర్డ్‌ ఎంఈవో హన్మయ్య, రిటైర్డ్‌ ఎంపీడీవో దేవన్న నివాళి అర్పించారు. జడ్చర్ల మండల విద్యా వనరుల కేంద్రం ఆవరణలోని సావిత్రిబాయి ఫూలే విగ్రహానికి టీఎస్‌ యూటీఎఫ్‌ నాయకులు కృష్ణ, నరేశ్‌ నివాళి అర్పించారు. జడ్చర్ల మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పుష్పలత, కౌన్సిలర్‌ చైతన్యచౌహన్‌, మినాజ్‌, రఘు, తుంగ రఘు నివాళి అర్పించగా, మునిసిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ లక్ష్మారెడ్డి నివాళి అర్పించారు. పోలేపల్లి జడ్పీహెచ్‌ఎస్‌లో జ్యోతిబాఫూలే ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వైస్‌ ప్రిన్సిపల్‌ శ్రీనివాసులు, రాఘవేందర్‌రెడ్డి నివాళి అర్పించారు. భూత్పూర్‌ మండల అన్నాసాగర్‌లో సర్పంచ్‌ శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో విద్యార్థులకు షూస్‌ పంపిణీ చేశారు. మిడ్జిల్‌, బాలానగర్‌, రాజాపూర్‌ మండల కేంద్రాలతో పాటు ఆయా గ్రామాల్లో సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి నివాళి అర్పించారు. హన్వాడ మండలంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ కిష్ట్యానాయక్‌, డీటీ వెంకటేశ్వరావు, పెద్దదర్పల్లిలో సర్పంచు దీప్తి ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి నివాళి అర్పించారు. నవాబ్‌పేట మండలం కాకర్లపాడ్‌ గ్రామంలో స్థానిక పాఠశాలలో సర్పంచ్‌ బాలయ్య సావిత్రబాయి ఫూలే చిత్రపటానికి నివాళి అర్పించారు. చిన్నచింతకుంట మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో లక్ష్మి నారాయణ, సూపరింటెండెంట్‌ మోసిన్‌ ఫూలే చిత్రపటానికి నివాళి అర్పించారు. దేవరకద్ర మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ దీపిక సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి నివాళి అర్పించారు. మాజీ మార్కెట్‌ చైర్మన్‌ ఆంజనేయులు, సంఘం అధ్యక్షుడు రాజు పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2026 | 11:25 PM