సంగమేశ్వరం బోటింగ్ సేవలు రద్దు
ABN , Publish Date - Jul 26 , 2026 | 11:50 PM
కృష్ణానదిలో వరద ఉధృతి పెరుగు తున్న నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సోమశిల - సంగమేశ్వరం మధ్య నడిపే బోటింగ్ సేవలను పూర్తిగా నిలిపివేసినట్లు జిల్లా పర్యాటకశాఖ అధికారి కల్వరాల నరసింహ ఆదివారం ఒక ప్రకట నలో తెలిపారు.
జిల్లా పర్యాటక శాఖ అధికారి నరసింహ వెల్లడి
కొల్లాపూర్, జూలై 26 (ఆంధ్రజ్యోతి):కృష్ణానదిలో వరద ఉధృతి పెరుగు తున్న నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సోమశిల - సంగమేశ్వరం మధ్య నడిపే బోటింగ్ సేవలను పూర్తిగా నిలిపివేసినట్లు జిల్లా పర్యాటకశాఖ అధికారి కల్వరాల నరసింహ ఆదివారం ఒక ప్రకట నలో తెలిపారు. జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. వరద నీటి మట్టం పెరిగినందున సంగమేశ్వర క్షేత్ర దర్శనం కోసం పర్యాటకులు ఎవరూ రా వద్దని ఈ విషయాన్ని గమనించి పర్యాటకులు, భక్తులు పర్యాటక శాఖకు సహకరించాలని కోరారు.