Share News

సనాతన ధర్మానికి విదేశాల్లో విశేష ఆదరణ

ABN , Publish Date - Mar 15 , 2026 | 11:26 PM

సనాతన హిందూ ధర్మానికి విదేశాల్లో విశేష ఆ దరణ లభిస్తుందని భువనేశ్వరి పీఠా ధిపతి కమలానంద భారతి స్వామి అన్నారు.

సనాతన ధర్మానికి విదేశాల్లో విశేష ఆదరణ
పాలెంలో హిందూ సమ్మేళనంలో భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద స్వామి

- భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామి

-ధర్మ పరిరక్షణకు హిందువులు సంఘటితం కావాలి

- పాలెంలో హిందూ సమ్మేళనం విజయవంతం

బిజినేపల్లి, మార్చి 15 (ఆంధ్రజ్యోతి) : సనాతన హిందూ ధర్మానికి విదేశాల్లో విశేష ఆ దరణ లభిస్తుందని భువనేశ్వరి పీఠా ధిపతి కమలానంద భారతి స్వామి అన్నారు. మండలంలోని పాలెంలోని వేంకటేశ్వర స్వా మి ఆలయ ప్రాంగణంలో ఆదివారం నిర్వ హించిన హిందూ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. హిందువులంతా సంఘటితమై ధర్మరక్షణకు పాటుపడాలని అన్నారు. వేద భూమి భారతదేశంపై 4 వేల సంవత్సరాల పాటు విదేశీయులు దాడి చేసిన హిందూ సంస్కృతి, సంప్రదాయాలు చెక్కు చెదరలే దంటే హిందూ సమాజం గొప్పదనమని గు ర్తించుకోవాలన్నారు. హిం దూ అంటేనే నాగరికత, హిందువులు భిన్నత్వంలో ఏకత్వం ప్రదర్శిస్తారని, హిందుత్వం ప్రకృతితో ముడిపడి ఉండి చెట్టు, పుట్ట, గాలి, నీరు, సమస్త జీవరాశులను దేవుళ్లుగా పూజించే గుణం అలవ ర్చిన గొప్పతనం హిందు త్వానిదని కొనియాడారు. దేవాలయాలు కేవలం నిర్మాణాలు మాత్రమే కాదని అవి మన నాగరికతకు ఆత్మ అని నే టి తరానికి, భవిష్యతు తరాలకు వివరించాల న్నారు. హిందువులంతా సంఘటితమైతే ప్ర పంచంలో విశ్వగురువుగా భారత్‌ పూర్వ వైభవం సంతరించుకుంటుదన్నారు. ప్రతీ ఒక్కరి లో దైవం కొలువై ఉంటుందన్నారు. అంతకు ముందు భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామికి వేద పండితుల మంత్రోచ్ఛా రణలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికి జ్యో తి ప్రజ్వలనతో సమ్మేళనాన్ని ప్రారంభించారు. సమ్మేళనానికి వేలాదిగా తరలివచ్చిన హిందు వులకు జున్నా శేఖర్‌రెడ్డి దంపతులు ఉచిత అన్నప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమం లో ప్రధాన వక్త అన్నదానం సుబ్రమణ్యం, ఏ మిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, సర్పంచ్‌ బోనాసి రామ కృష్ణ, ఉపసర్పంచ్‌ శ్రీనివాసులు, హిందూ స మ్మేళన ఉత్సవ సమితి అధ్యక్షుడు వస్పరి శి వుడు, ప్రధాన కార్యదర్శి గోవిందు జగదీష్‌, క న్వీనర్‌ జాకీర్‌ హుస్సేన్‌, కోశాధికారి కొంకలి మధు, సభ్యులు శ్రీనివాస్‌ గౌడ్‌, కిషోర్‌, వంగ రామన్‌ గౌడ్‌, వెంకట్‌ రెడ్డి, వెంకట్రాములు గౌడ్‌, తిరుపతయ్య, డాక్టర్‌ గోపాల్‌, సురేం దర్‌, గంధం వెంకటేశ్వర్లు ఉన్నారు.

Updated Date - Mar 15 , 2026 | 11:26 PM