Share News

సంపూర్ణత అభియాన్‌ వంద శాతం లక్ష్యాలను సాధించాలి

ABN , Publish Date - Feb 19 , 2026 | 11:35 PM

సంపూర్ణత అభియాన్‌లో వందశాతం ల క్ష్యాలను పూర్తి చేసేలా సంబంధిత శాఖ ల అధికారులు చిత్తశుద్ధ్దితో పనిచేయాల ని ఆస్పిరేషనల్‌ ప్రోగ్రాం సెంట్రల్‌ ప్రభా రి ఆఫీసర్‌ మానస గంగోత్రికాట అన్నా రు.

 సంపూర్ణత అభియాన్‌ వంద శాతం లక్ష్యాలను సాధించాలి
అలూరులో పాఠశాల విద్యార్థుల తో మాట్లాడుతున్న మానస గంగోత్రికాట, కలెక్టర్‌

ఆస్పిరేషనల్‌ ప్రోగ్రాం సెంట్రల్‌ ప్రభారి ఆఫీసర్‌ మానస గంగోత్రి కాట

గట్టు, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి) : సంపూర్ణత అభియాన్‌లో వందశాతం ల క్ష్యాలను పూర్తి చేసేలా సంబంధిత శాఖ ల అధికారులు చిత్తశుద్ధ్దితో పనిచేయాల ని ఆస్పిరేషనల్‌ ప్రోగ్రాం సెంట్రల్‌ ప్రభా రి ఆఫీసర్‌ మానస గంగోత్రికాట అన్నా రు. నీతి అయోగ్‌ సౌజన్యంతో నిర్వహిస్తు న్న ఆస్పిరేషనల్‌ ప్రోగ్రాం ప్రగతి పరిశీలనలో భాగంగా గురువారం ఆమె కలెక్టర్‌ తో కలిసి గట్టు మండలంలోని అలూరు, పెంచికలపాడు గట్టు గ్రామాల్లో పర్యటిం చారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజ రు, ఫలితాలు, మధ్యాహ్నా భోజనం మె నూ తదితర విషయాలను పరిశీలించా రు. విద్యార్థులకు అర్థమయ్యే రితీలో బోధన ఉండాలని సూచించారు. శిక్షణ పౌండేషన్‌ సంస్థ అధ్వర్యంలో విద్యార్థుల కు 13 ల్యాప్‌ టాప్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంపూ ర్ణత అభియాన్‌ 2.0 కార్యక్రమం జనవరి 28న ప్రారంభించామని తెలిపారు. అక్షరాస్యతలో వెనుకబడిన గట్టు మండలంలో విద్యారంగంలో ప్రగతి సాధించాలన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గత సంవత్సరం ఆస్పిరేషనల్‌ బ్లాక్‌ ప్రోగ్రాంలో చూపిన ప్రతిభకు జాతీయ స్థాయిలో ఐదు, దక్షణ భారతదేశ స్థాయిలో రెండోస్థానం సా ధించినట్లు చెప్పారు. కార్యక్రమంలో అద నపు కలెక్టర్‌ నర్సింగరావ్‌, డీఈవో విజ యలక్ష్మీ, డీఎంహెచ్‌వో, పంచాయతీరాజ్‌ డీఈ లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 19 , 2026 | 11:36 PM