Share News

ఘనంగా సంపత్‌కుమార్‌ జన్మదిన వేడుకలు

ABN , Publish Date - Nov 20 , 2026 | 11:12 PM

అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ జన్మదిన వేడుకలను శుక్రవారం కాంగ్రెస్‌ మండల నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌చేశారు.

ఘనంగా సంపత్‌కుమార్‌ జన్మదిన వేడుకలు
అయిజలో కేక్‌ కట్‌ చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

ఎర్రవల్లి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ జన్మదిన వేడుకలను శుక్రవారం కాంగ్రెస్‌ మండల నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌చేశారు. అనంతరం ఎర్రవల్లిలోని పార్టీ మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబి రంలో 40మందికి పైగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు నర్సిరెడ్డి మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, మనం ఇచ్చే రక్తం మరొకరి ప్రాణాలను కాపాడుతుం దని అన్నారు. గద్వాలలోని అర్బన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో ఎర్రవల్లి మాజీ సర్పంచ్‌ జోగుల రవి విద్యార్థులతో కలిసి కేక్‌ కట్‌చేసి పెన్నులు, బుక్‌లు, వ్యాసిలిన్‌ కిట్లు పంచారు. కార్యక్రమం లో పీఏసీఎస్‌ అధ్యక్షుడు మధునాయుడు, ఉపాధ్యక్షుడు వేముల శ్యామ్‌, సర్పంచులు రాజు, పె ద్దమద్దిలేటి, నాయకులు వెంకటేశ్‌యాదవ్‌, శ్రీనివాస్‌రెడ్డి, పరిపూర్ణాచారి, వెంకటేశ్‌, పల్లెరాజ్‌, ప్రభాకర్‌, ఆదాం, ప్రతాప్‌నాయుడు ఉన్నారు.

అయిజ: అయిజలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నాయకులు కేక్‌ కట్‌ చేసి సంబు రాలు చేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎం పీపీ ప్రకాశ్‌గౌడ్‌, మాజీ సింగిల్‌విండో అధ్యక్షు డు రాముడు, శ్రీధర్‌, హనుమన్న, రాజునారాయణ, మైబుపాష, జయన్న, లక్ష్మన్న పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2026 | 11:12 PM