అర్హులందరికీ సదరం ధ్రువపత్రాలు
ABN , Publish Date - Sep 23 , 2026 | 11:03 PM
అర్హులైన దివ్యాంగులందరికీ సదరం ధ్రువప త్రాలను నిబంధనల ప్రకారం జారీ చేస్తామని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
గద్వాల, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): అర్హులైన దివ్యాంగులందరికీ సదరం ధ్రువప త్రాలను నిబంధనల ప్రకారం జారీ చేస్తామని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. ప్రత్యేక శిబిరానికి హాజరుకాలేక పోయిన దివ్యాంగులకు నిర్ధేశిత సమయంలో ప్రభుత్వాస్పత్రిలో కూడా పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. సెర్ఫ్ స హకారంతో స్థానిక మహిళా సమాఖ్య కార్యాల యంలో రెండురోజుల పాటు మానసిక సమస్య లు ఉన్న దివ్యాంగులకు నిర్వహించిన ప్రత్యేక మెగా సదరం శిబిరాన్ని బుధవారం కలెక్టర్ సం దర్శించారు. ఈసందర్భంగా కలెక్టర్ అధికారులు, వైద్యులతో మాట్లాడిన తగు సూచనలు చేశారు. శిబిరంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ప లువురు కుటుంబ సభ్యులతో దివ్యాంగుల ఆరో గ్య పరిస్థితిని తెలుసుకున్నారు. శిబిరానికి వచ్చిన వారందరూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. రెం డో రోజు ప్రత్యేకంగా దివ్యాంగ చిన్నారులకు పరీ క్షలు నిర్వహిస్తున్నామని, అర్హులైన వారందరికీ సదరం ధ్రువపత్రాలు మంజూరు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ నర్సింగరావు, డీఆర్డీవో ముషాహిదా బే గం, డీపీఎం అరుణ, ఏపీఎం భీమన్న ఉన్నారు.