ఆర్టీసీ బస్సు, కారు ఢీ
ABN , Publish Date - Jul 21 , 2026 | 11:40 PM
ఆర్టీసీ బస్సు, కారు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలంలోని గుంతకోడూరు సమీపంలో ఈ సంఘటన జరిగింది.
- ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి
- గుంతకోడూరు వద్ద ఘటన
గుంతకోడూరు (తాడూరు), జూలై 21 (ఆంధ్రజ్యోతి) : ఆర్టీసీ బస్సు, కారు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలంలోని గుంతకోడూరు సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఆర్టీసీ కల్వకుర్తి డిపోకు చెందిన నాగర్‌కర్నూల్ బస్టాడ్ నుంచి ప్రయాణికులతో బయలుదేరింది. కల్వకుర్తి, నంద్యాల జాతీయ రహదారిపై గుంతకోడూరు సమీపంలో రాత్రి 8:30 గంటల సమయంలో నాగర్‌కర్నూల వైపు వెళ్తున్న కారు బస్సును ఢీకొన్నది. ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. కారు నడుపుతున్న వ్యక్తి అందులోనే చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న దాదాపు 25 మంది ప్రయాణికులు ఉండగా, ముందు సీట్‌లో కూర్చున్న ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని నాగర్‌కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముసురు వర్షం పడుతుండడంతో కొంత ఇబ్బంది కలిగినా, కారులోని వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీసేందుకు యత్నించారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్‌ఐ రాములు తెలిపారు.