Share News

సామాజిక తనిఖీలో రూ.5,574 రికవరీ

ABN , Publish Date - Nov 04 , 2026 | 10:39 PM

వీవీ జీ రాంజీ పథకంలో పనిచేస్తున్న సిబ్బంది మళ్లీ తప్పులు జరుగకుండా పనిచేయాలని లేకుంటే చర్యలు తప్పవని డీఆర్డీవో అడిషనల్‌ పీడీ వామనరావు పేర్కొన్నారు.

సామాజిక తనిఖీలో రూ.5,574 రికవరీ
సామాజిక తనిఖీలో పాల్గొన్న అధికారులు

హన్వాడ, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : వీవీ జీ రాంజీ పథకంలో పనిచేస్తున్న సిబ్బంది మళ్లీ తప్పులు జరుగకుండా పనిచేయాలని లేకుంటే చర్యలు తప్పవని డీఆర్డీవో అడిషనల్‌ పీడీ వామనరావు పేర్కొన్నారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో వీబీ జీ రాంజీ పథకం 16వ సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. ఏప్రిల్‌ 2025 నుంచి మార్చి 2026 వరకు జరిగిన పనులపై 10 రోజులుగా 35 గ్రామాల్లో తనిఖీ బృందం డీఆర్పీలు తనిఖీ చేశారు. వీబీ జీ రాంజీ పథకంలో రూ.4.86 కోట్లు ఖర్చు చేయగా, పంచాయతీరాజ్‌ శాఖ రూ.1.69 కోట్లు చేసిన పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు. బుధవారం తనిఖీ బృందం డీఆర్పీలు గ్రామాల వారిగా తనిఖీ నివేదికను ప్రజా వేదికలో వెల్లడించారు. 35 గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, టీఏలకు రూ.5.574 రికవరీ, ఫైన్లు విధించారు. జిల్లా విజిలెన్స్‌ అధికారి ప్రేమలత, ఎంపీడీవో యశోదమ్మ, ఏపీవో రాజేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2026 | 10:39 PM