డిజిటల్ అరెస్టు పేరుతో రూ.21.60 లక్షల మోసం
ABN , Publish Date - Oct 22 , 2026 | 11:36 PM
డిజిటల్ అరెస్టు పేరుతో భయపెట్టి డబ్బులు వసూలు చేసే సైబర్ నేరగాళ్లతో ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
- రూ. 9.20 లక్షలు ఫ్రీజ్
గద్వాల క్రైం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): డిజిటల్ అరెస్టు పేరుతో భయపెట్టి డబ్బులు వసూలు చేసే సైబర్ నేరగాళ్లతో ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిజిటల్ అరెస్ట్ అనే చట్టపరమైన విధానం ఏది లే దని, సీబీఐ, ఈడీ, పోలీస్‌శాఖ, సుప్రీంకోర్టు పేరుతో డిజిటల్ అరెస్ట్ అంటూ ఎవరైనా ఫోన్ చేసి బెదిరించినా, డబ్బులు అడిగినా నమ్మవద్ద ని ఎస్పీ తెలిపారు. ఇటీవల గద్వాల పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనలో సైబర్ నేరగాళ్లు సుప్రీంకోర్టు పేరుతో బాధితుడిని బెదిరించి రూ. 21.60 లక్షలు బదిలీ చేయించుకున్నారని ఎస్పీ తెలిపా రు. జిల్లా సైబర్ సెల్ తక్షణ చర్యలతో రూ. 9.20 లక్షలు మొత్తాన్ని ఫ్రీజ్ చేసినట్లు పేర్కొన్నారు. కాగా సైబర్ నేరగాళ్లు ఫోన్‌చేసి సుప్రీంకోర్టు నుంచి మాట్లాడుతున్నామని, అడ్వకేట్‌గా తనను పరిచయం చేసుకొని, అతని బ్యాంకు ఖాతాపై మనీలాండరింగ్ కేసు నమోదు అయ్యిందని తెలిపాడు. బాఽధితుడిని, ఆయన కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తామని వీడియో కాల్‌లో బెదిరించారు. కేసు నుంచి బయట పడాలంటే డ బ్బులు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో రూ. 21.60 లక్షలు బదిలీ చేశా రు. రెండు రోజుల తర్వాత ఈ విషయాన్ని బాధితుడు తన స్నేహితుడికి చెప్పడంతో అతను జిల్లా సైబర్ సెల్‌ను సంప్రదించడంతో ఎన్ సీఆర్‌పీ పోర్టలో కేసు నమోదు చేసి రూ. 9.20 లక్షలను బ్యాంకు అధి కారులను అప్రమత్తం చేసి ఫ్రీజ్ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.