Share News

పట్టణాభివృద్ధికి రూ. 15 కోట్ల నిధులు

ABN , Publish Date - Oct 14 , 2026 | 11:33 PM

పట్టణాభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసిందని కాంగ్రెస్‌ పార్టీ పేట నియోజకవర్గ ఇన్‌చార్జి కుంభం శివ కుమార్‌రెడ్డి అన్నారు.

పట్టణాభివృద్ధికి రూ. 15 కోట్ల నిధులు
పేట 18వ వార్డులో రోడ్డు పనులు ప్రారంభిస్తున్న మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కొండా శ్వేతసత్యయాదవ్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ మంజులజీఆర్‌రెడ్డి, కౌన్సిలర్‌ రవితేజ, కాంగ్రెస్‌ పార్టీ నారాయణపేట నియోజకవర్గ ఇన్‌చార్జి కుంభం శివకుమార్‌రెడ్డి తదితరులు

- రూ.75 లక్షలతో మునిసిపాలిటీకి రెండు యంత్రాలు

- స్వీపింగ్‌ మిషన్‌ను ప్రారంభించిన నాయకులు

నారాయణపేట, అక్టోబరు 14 (ఆంధ్ర జ్యోతి): పట్టణాభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసిందని కాంగ్రెస్‌ పార్టీ పేట నియోజకవర్గ ఇన్‌చార్జి కుంభం శివ కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం నారాయణ పేట మునిసిపాలిటీలో అభివృద్ధి పనులతో పా టు రెండు యంత్రాలకు మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కొండా శ్వేతసత్యయాదవ్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ మం జులజీఆర్‌రెడ్డి, కౌన్సిలర్‌ పూజలు నిర్వహించి ప్రారంభించగా, కార్యక్రమానికి హాజరైన కుం భం శివకుమార్‌రెడ్డి మాట్లాడారు. నియోజకవ ర్గంలో అభివృద్ధి పనులతో పాటు రూ.45 లక్ష లతో స్వీపింగ్‌ యంత్రం, రూ.35 లక్షలతో హై డ్రాలిక్‌ స్కైల్యాడర్‌ మిషన్‌లు వచ్చాయన్నారు. అలాగే 18వ వార్డులో రూ.4 కోట్లతో టీయూ ఎఫ్‌ఐడీసీ పథకం కింద రోడ్డు పనులకు చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌, కౌన్సిలర్లు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. కమిషనర్‌ శంకర్‌, కౌన్సిలర్లు రవితేజ, బండి రాజేశ్వరి, శ్వేత, రాజే ష్‌ఘట్‌, నాయకులు శివారెడ్డి, నాగరాజు, రాజే ష్‌, ఈదప్ప, వెంకుగౌడ్‌, అబ్దుల్‌ సలీం, రవిగౌడ్‌, శరణప్ప, మునిసిపల్‌ సిబ్బంది ఉన్నారు.

Updated Date - Oct 14 , 2026 | 11:33 PM