Share News

సర్కార్‌పై గులాబీ గర్జన

ABN , Publish Date - Jan 02 , 2026 | 11:16 PM

మునిసిపాలిటీలో నెలకొన్న సమ స్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. శక్రవారం సుభాష్‌ చంద్రబోస్‌ చౌరస్తాలో ధర్నా చేపట్టారు.

సర్కార్‌పై గులాబీ గర్జన
ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

- సమస్యలను పరిష్కరించాలని ధర్నా

పెబ్బేరు, జనవరి 2 (ఆంద్రజ్యోతి): మునిసిపాలిటీలో నెలకొన్న సమ స్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. శక్రవారం సుభాష్‌ చంద్రబోస్‌ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. గత రెండు ఏళ్లుగా రోడ్డు విస్తరణ పనుల్లో పురోగతి కనిపిం చడం లేదన్నారు. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు పట్టాలు అందజేయాలని డిమాండ్‌ చేశారు. సుంకులమ్మ ఆలయం దగ్గర కల్వర్టు, బీటీ రోడ్డు పనులు వెంటనే చేపట్టాలన్నారు. కొల్లాపూర్‌ చౌరస్తా నుంచి వే ణుగోపాల స్వామి ఆలయం వరకు రోడ్డు విస్తరణ, సెంట్రల్‌ లైటింగ్‌ పను లు చేపట్టాలని పేర్కొన్నారు. క్రీడాకారులకు క్రీడా మైదానం వాడుకలోకి తేవాలి.. చెత్త సేకరణ వాహనాలు, అమృత్‌ పథకం ద్వారా చేపడుతున్న వాటర్‌ ట్యాంకుల నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఆం దోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని ట్రాఫిక్‌ అంతరాయాన్ని పునరుద్ధరించారు. బీఆర్‌ఎస్‌ నాయకులు రాములు యాదవ్‌, దిలీప్‌ కుమా ర్‌ రెడ్డి, కరుణశ్రీ, కర్రెస్వామి, విశ్వరూపం, హరిశంకర్‌ నాయుడు, ఎల్లారెడ్డి, సహాదేవుడు, మణ్యం, శ్రీధర్‌ రెడ్డి, గొడుగు శాంతన్న, భారతి పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2026 | 11:16 PM