చిత్తడి నేలల పరిరక్షణకు పటిష్ట చర్యలు
ABN , Publish Date - Sep 22 , 2026 | 11:49 PM
జోగుళాంబ గద్వాల జిల్లా లోని చిత్తడి నేలల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, జలవనరుల హద్దులను క్షేత్రస్థా యిలో పక్కాగా గుర్తించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
జిల్లాలో 101 చిత్తడి నేలల గుర్తింపు
పర్యావరణ పరిరక్షణ, పర్యాటక అభివృద్ధికి దోహదం : కలెక్టర్
గద్వాల, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లా లోని చిత్తడి నేలల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, జలవనరుల హద్దులను క్షేత్రస్థా యిలో పక్కాగా గుర్తించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం స్థానిక ఐ డీవోసీ కాన్ఫరెన్స్ హాల్‌లో డీఎఫ్‌వో నవీన్ రెడ్డి, అదనపు కలెక్టర్ మధుమోహన్‌తో కలిసి కలెక్టర్ జిల్లాస్థాయి చిత్తడి నేలల సంరక్షణ కమిటీ స మావేశం నిర్వహించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని చిన్నకుంటలు, చెరువులు, రి జర్వాయర్ల వంటి జల వనరులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటి విస్తీర్ణం, హద్దులకు సంబంధిం చిన వివరాలను పక్కాగా నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో ఇలాంటి చిత్తడి నేలలను 101 గుర్తించామని, వాటి సరిహద్దులను క్షేత్రస్థా యిలో పక్కాగా కొలిచి రికార్డుల్లో నమోదు చే యాలన్నారు. ఇప్పటికే జిల్లాలోని పలు గ్రామా ల్లో రీ సర్వే పనులు జరుగుతున్నందున వీటి ప రిధిలో చిత్తడి నేలలు ఉంటే సర్వే కొంత సులభ తరం అవుతుందన్నారు. చిత్తడి నేలల ఆవాసా ల పరిధిలో ప్రజలతో గ్రామసభలు కూడా నిర్వ హించి అభ్యంతరాలు స్వీకరించడమేకాక ఎలాం టి ఇబ్బందులు తలెత్తకుండా ముందుకువెళ్లాల న్నారు. సర్వే, హద్దుల నిర్ధారణ ప్రక్రియను నిర్ణీ త గడువులోగా పూర్తిచేసి సమగ్ర నివేదికను స మర్పించాలని ఆదేశించారు. ప్రతి జలవనరును స్వయంగా పరిశీలించి, వాస్తవ పరిస్థితుల ఆధా రంగా వివరాలు నమోదు చేయాలని స్పష్టం చే శారు. సంబంధిత శాఖ జిల్లా అధికారులు పను ల పురోగతిపై సమీక్షిస్తూ, ఎక్కడైనా సమస్యలు ఎదురైతే సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరించాలని తెలిపారు. చిత్తడి నేలల సంర క్షణతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని, అవసరమైన చోట పర్యాటక అభివృద్ధి చేయాల న్నారు. సమావేశంలో ఆర్డీవో శ్రీనివాసరావు, నీటి పారుదల శాఖ ఎస్‌ఈ కేశవరావు, సర్వే ఏడీ నూకరాజు, డీపీఓ శ్రీకాంత్, మత్స్య శాఖ అధికా రి షకీలా భాను, ఫారెస్ట్ రేంజ్ అధికారి పర్వేజ్ అహ్మద్, అధికారులు పాల్గొన్నారు.