Share News

కొనుగోలు కేంద్రాల్లో దోపిడీ అరికట్టాలి

ABN , Publish Date - May 03 , 2026 | 11:40 PM

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను నిలుపు దోపిడీకి గురవుతున్నారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బలరాం ఆందోళన వ్యక్తం చేశారు.

కొనుగోలు కేంద్రాల్లో దోపిడీ అరికట్టాలి
కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న బలరాం

- సీఐటీయూ జిల్లా కార్యదర్శి బలరాం

మరికల్‌, మే 3 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను నిలుపు దోపిడీకి గురవుతున్నారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బలరాం ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం మండలంలోని తీలేరు శివారులో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ తరుగు, తాలు, గన్నీ బ్యాగు బరువు ఇతర కారణాలతో క్వింటా ల్‌కు మూడు నుంచి ఐదు కిలోల వరకు ధాన్యా న్ని అదనంగా తీసుకుంటున్నారని ఆరోపించా రు. దీంతో పాటు తూకంలో రెండు కిలోల చొ ప్పున మోసం చేస్తున్నారన్నారు. అదే విధంగా హమాలీ, లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేస్తే 40 కిలో ల బస్తాలకు కేవలం రూ.20 మాత్రమే చెల్లిస్తు న్నారన్నారు. కొనుగోలు కేంద్రాల దగ్గర తాగునీరు, నీడ తదితర కనీస వసతులు లేవన్నారు.

Updated Date - May 03 , 2026 | 11:40 PM