రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత
ABN , Publish Date - Jun 10 , 2026 | 11:12 PM
రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత అని జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్.ఎస్.చౌహాన్ అన్నారు. రహదారి నియమాలను పాటి స్తూ ప్రయాణించి సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని సూచించారు.
- జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్‌ఎస్ చౌహన్
- ఎర్రవల్లి చౌరస్తాలో ‘అరైవ్ - అలైవ్’ కార్యక్రమం
ఇటిక్యాల, జూన్ 10 (ఆంధ్రజ్యోతి) : రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత అని జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్.ఎస్.చౌహాన్ అన్నారు. రహదారి నియమాలను పాటి స్తూ ప్రయాణించి సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని సూచించారు. ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జోగుళాంబ గద్వాల జిల్లా, ఎర్ర వల్లి చౌరస్తాలో బుధవారం ‘అరైవ్ - అలై వ్’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం హత్యల కంటే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రంకెన్ డ్రైవ్, రాంగ్‌రూట్ డ్రైవింగ్, నిర్లక్ష్యంగా ఓవర్‌టేక్ తదితర ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలన్నారు. ఎస్‌పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలు జీవి తాంతం క్షోభను అనుభవిస్తుంటాయన్నారు. కమాండెంట్ జయరాములు మాట్లాడుతూ జీవితంలో ఏమి కోల్పోయినా తిరిగి సంపా దించుకోవచ్చని, ప్రాణం పోతే తిరిగి పొంద లేమన్నారు. ఈ సందర్భంగా 10 మంది ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు అందిం చారు. అంతకుముందు డీఐజీకి బెటాలి యన్ సిబ్బంది గౌరవవందనం చేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో డీటీవో రాధిక, డీఎస్‌పీ మొగులయ్య మాట్లాడారు. కార్యక్రమంలో అలంపూర్ సీఐ ప్రదీప్‌కు మార్, ఎస్‌ఐలు రవినాయక్, తరుణకుమా ర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.