రోడ్డు నిబంధనలు విధిగా పాటించాలి
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:17 PM
రహదారి ప్రమాదాలను నివారించేందుకు వా హనదారులందరూ విధిగా రోడ్డు నిబంధనలు పాటించాలని లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, న్యాయవాది లక్ష్మణస్వామి అన్నారు.
- ఎల్‌ఏడీసీ లక్ష్మణస్వామి
- గద్వాల పట్టణంలో రోడ్డు సురక్ష అభియాన్ ర్యాలీ
గద్వాల టౌన్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : రహదారి ప్రమాదాలను నివారించేందుకు వా హనదారులందరూ విధిగా రోడ్డు నిబంధనలు పాటించాలని లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, న్యాయవాది లక్ష్మణస్వామి అన్నారు. జిల్లా న్యా యసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవా రం పట్టణంలో రోడ్డు సురక్ష అభియాన్ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా స్థానిక అంబేడ్క ర్ సర్కిల్ వద్ద వాహనదారులు, యువకులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా మాట్లాడిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ లక్ష్మణస్వామి, శ్రీనివాసులు, ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. దీంతో ఆ కుటుంబాల పరిస్థితి ఆగమ్యగోచరం గా మారే పరిస్థితి తలెత్తిందన్నారు. నిబంధన లు పాటించడం రోడ్డు భద్రత మాత్రమే కా కుండా ప్రాణరక్షణ అన్న విషయం ప్రతీ ఒక్క రూ అవగతం చేసుకోవాలన్నారు. ర్యాలీలో పా ల్గొన్న పారా లీగల్ వలంటీర్లు ‘ట్రాఫిక్ నియ మాలను పాటిద్దాం-ప్రాణాలను కాపాడుకుం దాం’, ‘హెల్మ్‌ట్, సీట్ బెల్ట్ తప్పనిసరి’, ‘మద్యం సేవించి వాహనం నడపవదు’్ద, ‘వేగం కాదు- భద్రత ముఖ్యం’ అనే నినాదాలు చేస్తూ ప్లకార్డు లు ప్రదర్శించారు. కార్యక్రమానికి హాజరైన ట్రా ఫిక్ ఎస్‌ఐ బాలచంద్రుడు, ట్రాఫిక్ నియమా లు, రోడ్డు భద్రతపై ప్రతీఒక్కరూ వాహనదారు లతో పాటు పాదచారులు సైతం అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు, విద్యార్థులు, చైల్ట్ వెల్ఫేర్ అధికారులు ఉన్నారు.