Share News

రహదారి నియమాలను తప్పక పాటించాలి

ABN , Publish Date - Jan 21 , 2026 | 11:11 PM

అధికారులు రోడ్డు నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ రహదారి భద్రత విషయంలో ప్రజల కు ఆదర్శంగా నిలవాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతో ష్‌ అన్నారు.

రహదారి నియమాలను తప్పక పాటించాలి
ప్రమాదాల నివారణపై ప్రతిజ్ఞ చేస్తున్న కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యే, అధికారులు

  • జోగుళాంబ గద్వాల కలెక్టర్‌ బీఎం సంతోష్‌

గద్వాలన్యూటౌన్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): అధికారులు రోడ్డు నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ రహదారి భద్రత విషయంలో ప్రజల కు ఆదర్శంగా నిలవాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతో ష్‌ అన్నారు. జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో బు ధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన అరైవ్‌ - అలైవ్‌ అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, ఎస్పీ శ్రీనివాసరావులో కలి సి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసం దర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అధికారులు తప్పకుండా రహదారి నియమాలను పాటించాలన్నారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖ రహదారులు నాణ్యతతో పాటు రోడ్డు భద్రత ఉండే లా డిజైన్‌ చేసే విషయంలో అధికారులు నిబంధనలను పాటించాలని చెప్పారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ నిత్యం ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరగడం సర్వసాధారణమైందని, ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ప్రతీ ఒక్కరు రహదారి భద్రతపై అవగాహనతో ముందుకెళ్లాలన్నారు. మద్యం తాగి, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడపడం వంటి కారణాలతో ప్రమాదాల బారిన పడుతున్నారన్నా రు. రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ బాధ్యతాయుతమైన ప్రవర్తనతోనే రహదారి ప్రమాదాల ను నివారించవచ్చన్నారు. అనంతరం అధికారు లు, సిబ్బందితో కలిసి రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నర్సింగరావు, అదనపు ఎస్పీ శంకర్‌, ఆర్డీవో అలివేలు ఉన్నారు.

Updated Date - Jan 21 , 2026 | 11:11 PM