Share News

రూ.20వేల కోట్లతో రోడ్ల అభివృద్ధి

ABN , Publish Date - Jul 13 , 2026 | 11:55 PM

రాష్ట్రంలోని రోడ్లను అభివృద్ధి చేసేందుకు రూ.20వేల కోట్లను ఖర్చు చేస్తున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

రూ.20వేల కోట్లతో రోడ్ల అభివృద్ధి
రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు

- గద్వాల జిల్లాలో రూ.339.39 కోట్ల పనులకు శంకుస్థాపన

- మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో ముందుకు..

- రెండేళ్లలో పాలమూరు పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి

- రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

గద్వాల/ ధరూర్‌ జూలై 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని రోడ్లను అభివృద్ధి చేసేందుకు రూ.20వేల కోట్లను ఖర్చు చేస్తున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో మొద టి విడుతలో రూ.339.39కోట్లతో నేటి నుంచే రోడ్ల పనులను మొదలు పెడుతున్నామని ఆ యన అన్నారు. సోమవారం గద్వాల జిల్లా ధరూర్‌ మండల కేంద్రంలో గద్వాల-రాయిచూ ర్‌ అంతరాష్ట్ర రోడ్డు అభివృద్ధ్దికి ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమం రెండింటిని సమానంగా అమలు చేస్తూ రాష్ర్టాభివృద్ధికి కృషి చేస్తుంటే బావబామ్మర్దులు ఓర్వలేకి విమర్శించే పనిపెట్టుకున్నారన్నారు. తెలంగాణ కోసం కేసీ ఆర్‌ ఒక్కడే కొట్లాడలేదని, తాను, జూపల్లి కృష్ణారావు ఇద్దరం కొట్లాడి రాజీనామా చేశామని గుర్తుచేశారు. రోడ్లు వేయలేదు.. డబుల్‌ బెడ్రూ మ్‌ ఇండ్లు ఇవ్వలేదు.. రేషన్‌ కార్డులు ఇవ్వలేదు.. కానీ కేసీఆర్‌ రాష్ర్టాన్ని రూ8లక్షల కోట్ల అప్పుల్లో ముంచాడు. ఫామ్‌హౌజ్‌లో పడుకొని బయటకు రావడం లేదని విమర్శించారు. కానీ, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే వాటిని అమలు చేసి చూపించామని అ న్నారు. మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యం తో అద్దెబస్సులు, సోలార్‌ ఉత్పత్తి కేంద్రాలు, పెట్రోల్‌ పంపులు ఇస్తున్నామని తెలిపారు. నా రాయణపేటలో పెట్రోల్‌ పంపు నిర్వహించి రూ.10లక్షల ఆదాయం పొందారని గుర్తుచేశా రు. జిల్లాలో ఇరిగేషన్‌ రోడ్లను ఆర్‌అండ్‌బీ పరిధిలోకి తీసుకవచ్చి వాటిని రూ.40కోట్లతో అభివృ ద్ధి చేస్తామని మంత్రి ప్రకటించారు. పాలమూ రు జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేస్తామని, ఎస్‌ఎల్‌బీసీ పనులను కూడా త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు.

అప్పుల్లో కూరుకుపోవద్దు : మంత్రి జూపల్లి

రైతులు, రైతు కూలీలు చాలా కష్టపడేతత్వం ఉన్నవారు. అయినా అప్పుల్లో కురుకుపోతున్నా రు. అనవసరమైన ఖర్చులకు పోకుండా పొదు పు పాటించాలని సూచించారు. ప్రస్తుతం వ ర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని ప్రాజెక్టులలో నీటి నిల్వలు పడిపోతున్నాయని గుర్తుచేశారు. అందుకే జూరాలకు మించి గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ సామర్థ్యం పెంచితే ఈ పరిస్థితి ఉండదని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డిని ఒప్పించి గుడ్డెందొడ్డి, గట్టు ఎత్తిపోతల పథకం సామర్థ్యం పెంచేవిధంగా చూశామని అన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. గద్వాలలో రోడ్ల అభివృద్ధ్దికి మంత్రి సహకరించాలని కోరారు. ఇరిగేషన్‌ రోడ్ల ను ఆర్‌అండ్‌బీ పరిధిలోకి తీసుకొని అభివృద్ధి చేయాలని కోరారు. కార్యక్రమంలో అలంపూర్‌, షాద్‌నగర్‌ ఎమ్మెల్యేలు విజయుడు, శంకర్‌, గొర్రె లు మేకల అభివృద్ధి సమాఖ్య చైర్‌పర్సన్‌ సరిత, కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషాషేక్‌, అదనపు కలెక్టర్లు మధుమోహన్‌, నర్సింగరావు, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ జయలక్ష్మి, మార్కెట్‌ చైర్మన్‌ హనుమంతు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు సుభాన్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 13 , 2026 | 11:55 PM