Share News

రైజింగ్‌ పాలమూరు 2047

ABN , Publish Date - Jan 16 , 2026 | 11:25 PM

రాష్ట్ర ప్రగతి కోసం ప్రభుత్వం ఎలాగైతే విజన్‌ 2047ను ఆవిష్కరించిందో.. తాను కూడా రైజింగ్‌ పాలమూరు 2047 కోసం ప్రణాళికలు చేస్తున్నామని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. రెండేళ్లలో రూ.2 వేల పైచిలుకు కోట్లతో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేసిన తాము..

రైజింగ్‌ పాలమూరు 2047
మీడియాతో మాట్లాడుతున్న యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

రెండేళ్లలో రూ.2,000 కోట్లకుపైగా నిధులు మంజూరు.. 25 ఏళ్ల విజన్‌ లక్ష్యం

హైదరాబాద్‌, వరంగల్‌ తర్వాత మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌కు అధిక నిధులు

ఒకే రోజు సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా రూ. 1284 కోట్ల పనులకు శ్రీకారం

ట్రిపుల్‌ఐటీ, యంగ్‌ ఇండియా స్కూల్‌, యూజీడీ, అమృత్‌ పనులకు శంకుస్థాపన

పాలమూరు బిడ్డ సీఎంగా ఉండి నిధులిస్తుండటంతో కార్పొరేషన్‌కు స్వర్ణయుగం

మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి

మహబూబ్‌నగర్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రగతి కోసం ప్రభుత్వం ఎలాగైతే విజన్‌ 2047ను ఆవిష్కరించిందో.. తాను కూడా రైజింగ్‌ పాలమూరు 2047 కోసం ప్రణాళికలు చేస్తున్నామని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. రెండేళ్లలో రూ.2 వేల పైచిలుకు కోట్లతో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేసిన తాము.. 25 ఏళ్ల కోసం పనులకు ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు. మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలమూరు బిడ్డ సీఎంగా ఉండటంతో ఆయనకు ఉన్న సమగ్ర అవగాహనతో, సరైన పంథాలో ప్లానింగ్‌ చేస్తూ.. ప్రతీ కార్యక్రమాన్ని నిబంధనల ప్ర కారం పకడ్బందీగా చేపడుతున్నట్లు పేర్కొన్నా రు. ఉమ్మడి రాష్ట్రంలో పరాయి పాలన వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందని, అంతకంటే ఎక్కువగా బీఆర్‌ఎస్‌ పాలనలో న ష్టం జరిగిందని అన్నారు. పాలమూరు పే రు చెప్పుకుని అందరూ బాగుపడ్డారు కానీ జిల్లాను పట్టించుకోలేదన్నారు. గత పదేళ్లలో గజ్వేల్‌, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలకు ఔటర్‌ రింగ్‌రోడ్డు, అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ, పార్కులు, రోడ్ల వెడల్పు ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేసుకున్నారు.. కానీ రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరుకు మాత్రం ఏమీ చేయలేదని విమర్శించారు. ఆయనను గెలిపించడంలో కీలకపాత్ర పోషించిన తనకు ఆయన ఏం నష్టం చేశారో తెలుసని అన్నారు. పాలమూరుకు ఒక్క అర్బన్‌ ఇన్‌ఫ్ర్టాస్ట్రక్చర్‌ ప్రాజెక్టు కూడా చేపట్టకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.

రూ.1,284 కోట్లతో అభివృద్ధి పనులు

మహబూబ్‌నగర్‌ మునిసిపాలిటీ 1952లో ఏర్పడిందని, ఇప్పటికి దాదాపు 75 ఏళ్లవుతుండగా ఏళ్ల నుంచి ఎన్నో అపరిష్కృత సమస్యలు ఉన్నాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. వాటి పరిష్కారం కోసం సీఎం సంక్రాంతి కానుకగా పాలమూరుకు వచ్చి సుమారు రూ.1,284 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారని చె ప్పారు. అందులో రూ.200 కోట్లతో ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటు, రూ.200 కోట్లతో యంగ్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు శంకుస్థాపన చేయనున్నారని అన్నారు. ఎంవీఎస్‌ కాలేజీలో రూ. 20 కోట్లతో నూతన భవన నిర్మాణం, రూ.603 కోట్లతో మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారన్నారు. వచ్చే రెండేళ్లలో మొత్తం కాలనీలు, వార్డులు, మెయిన్‌ రోడ్ల వెం ట ఎక్కడా ఓపెన్‌ నాలాలు లేకుండా చేస్తామ ని అన్నారు. అలాగే రూ.220 కోట్లతో తాగునీటి వ్యవస్థ పునరుద్ధరణ, బలోపేతం కోసం పనుల కు శ్రీకారం చుట్టనున్నామని తెలిపారు. గతం లో రామన్‌పాడు ద్వారా, తర్వాత మిషన్‌ భగీరథ ద్వారా, కోయిల్‌సాగర్‌ నుంచి నీరు అందుతోందన్నారు. రోజురోజుకూ పట్టణ విస్తరణ, పంపింగ్‌ కెసాసిటీ తగ్గిపోవడం, డిమాండ్‌ తీ ర్చలేకపోవడం, పైప్‌లైన్‌ లీకేజీల కారణంగా ఇ బ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాగునీటి వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. అలాగే గతంలో భూ సమస్య వల్ల మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీ మంజూరు కాలేదని, ఇప్పుడు ఆ సమస్య పరిష్కరించడం ద్వారా రూ.40 కో ట్లతో ఆ భవనానికి మెడికల్‌ కాలేజీ దగ్గరనే శంకుస్థాపన చేస్తామని అన్నారు. హైదరాబా ద్‌, వరంగల్‌ తర్వాత మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌కు అధిక నిధులు ఇస్తున్నారని చెప్పారు.

భవ్య మహబూబ్‌నగర్‌కు కృషి

మహబూబ్‌నగర్‌ మునిసిపాలిటీని కార్పొరేషన్‌ ఏర్పాటు చేసుకోవడం వల్ల అధిక నిధులు వస్తున్నాయని, రాబోవు రోజుల్లో భవ్య మహబూబ్‌నగర్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు. అం దుకోసం ఒక సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ను రెడీ చే స్తున్నామన్నారు. భవిష్యత్‌లో మహబూబ్‌నగ ర్‌, జడ్చర్ల, భూత్పూరు మునిసిపాలిటీల కలయికతో మహానగరం అవతరించే పరిస్థితి ఉం దని అన్నారు. పోలేపల్లి సెజ్‌తో ఇండస్ర్టియల్‌ హబ్‌గా.. దేవరకద్రలో ఏర్పాటు కాబోయే సం స్థలతో ఢిపెన్స్‌ కారిడార్‌గా.. మహబూబ్‌నగర్‌ విద్యా సంస్థలతో ఎడ్యుకేషన్‌ హబ్‌గా.. మెడిక ల్‌ వసతులతో మెడికల్‌ హబ్‌గా.. బెంగళూరు జాతీయ రహదారిపై ఉండటంతో ట్రాన్స్‌పోర్టేషన్‌ హబ్‌గా ఈ ప్రాంతం మారుతుందని అ న్నారు. పాలమూరు-రంగారెడ్డిలో కల్వకుంట్ల కుటుంబం వేసిన చిక్కుముళ్లను విప్పుతున్నావ్నఆ్నరు. మూడు ఏళ్లలో దాన్ని పూర్తి చేయడంతోపాటు సమాంతరంగా మక్తల్‌-నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పూర్తితో పై భా గంలో 6 లక్షల ఎకరాలకు నీరివ్వాలనే లక్ష్యం పెట్టుకున్నామని చెప్పారు. నికర జలాల కేటాయింపుల ఆధారంగానే ప్రాజెక్టులు చేపడతామని చెప్పారు. గతంలో సీఎంతో అభివృద్ధి ప నులు అడగాలంటే ఇబ్బంది ఉండేదని, తాము సోదరభావంతో సీఎం రేవంత్‌రెడ్డితో నిధులు తెచ్చుకోగలమన్నారు. ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లో పనులు గ్రౌండింగ్‌ అవుతున్నాయన్నారు. పెండింగ్‌ పనులనూ ప్రాధాన్య క్రమం లో పూర్తి చేస్తామని, చిక్కుముళ్లు విప్పడానికి సమయం పడుతోందని తెలిపారు. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు కూడా పునఃప్రారంభమయ్యాయన్నారు. ఈవీఎం గోదాం తరలింపునకు ఆర్డర్‌ తీసుకురావడానికే తమకు సంవత్సరన్నర సమయం పట్టిందన్నారు. ఏదై నా ప్రాజెక్టును చేపట్టే ముందే సమస్యలు ఏం వస్తాయో పరిష్కరించి.. పనులు చేపట్టాలని అన్నారు.

Updated Date - Jan 16 , 2026 | 11:25 PM