Share News

ధర్మం మనవైపు ఉంది.. గీత గీసి కొట్లాడతా

ABN , Publish Date - Sep 30 , 2026 | 11:16 PM

ధర్మం మనవైపు ఉంది కాబట్టే పాలకులపై గీతగీసి కొట్లడతానని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్య క్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.

ధర్మం మనవైపు ఉంది.. గీత గీసి కొట్లాడతా
సమావేశంలో మాట్లాడుతున్న మంద కృష్ణ మాదిగ

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ

వనపర్తి టౌన్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ధర్మం మనవైపు ఉంది కాబట్టే పాలకులపై గీతగీసి కొట్లడతానని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్య క్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. బుధవారం వనపర్తి పట్టణంలోని ఆర్‌జీ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన దళిత క్రైస్తవుల గర్జన మహాసభకు ఆయ న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సుప్రీం కోర్టు తీర్పుతో దళిత క్రైస్తవుల్లో ఆవేదన, భయం పెరిగిందని, దళిత క్రైస్తవులు ఒంటరి వారు కాదని, వారి తరఫున పోరాడటానికి తాను ధర్మం వైపు నిలబడతానన్నారు. ఆర్టికల్‌ 25 ప్రకారం మత స్వేచ్ఛను హరించే హక్కు దేశంలో ఎవరికీ లేదన్నారు. క్రైస్తవ మతం పుచ్చుకున్న ఓసీలు, బీసీలకు మతం మారనప్పుడు ఎస్సీలకు ఎలా మారుతుందని నిలదీశారు. సుప్రీం కోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధంగా ఉందన్నారు. దళిత క్రైస్తవుల ఈనాటి కష్టాలకు కాంగ్రెస్సే కారణమని అన్నారు. కాంగ్రెస్‌ 1950 లో తీసుకొచ్చిన ఆర్డర్‌ నేడు దళిత క్రైస్తవుల మెడకు కత్తిలా వేలాడుతోం దన్నారు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు తీర్పుపై సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, రేవంత్‌రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నిం చారు. ప్రస్తుతం కేంద్రంపై యుద్ధం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాన ని, కాంగ్రెస్‌ పార్టీ మాత్రం దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దుపై తన వైఖరి చెప్పడం లేదన్నారు. ఇప్పటికైన క్రైస్తవులు కేవలం చర్చిలకే పరి మితం కాకుండా తమ హక్కులను సాధించుకోవడానికి రోడ్డుపైకి రావాల ని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆల్‌ ఇండియా క్రిస్టియన్‌ ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షుడు దగ్గపాటి విజయరాజు, రాజేశ్వర్‌రావు, షమ్య, ఎన్‌సీ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మార్టిన్‌ లూథర్‌, శాస్త్రి, అమృత్‌సాగర్‌, ఎమ్మార్పీఎస్‌ అనుబంధ సంఘాల నాయకులు, దళిత క్రైస్తవులు, దళితు లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2026 | 11:17 PM