Share News

పోరాడితేనే విద్యాహక్కు చట్టం

ABN , Publish Date - Sep 24 , 2026 | 12:12 AM

రాష్ట్రంలోని సబ్బండ వర్గాలు పోరాడితేనే విద్యాహ క్కు చట్టాన్ని సాధించుకోగలమని మాజీ ఐఏఎస్‌ అధికారి, తెలంగాణ పీపుల్స్‌ ప్రంట్‌ (టీపీఎఫ్‌) నాయకుడు ఆకునూ రి మురళి అన్నారు.

పోరాడితేనే విద్యాహక్కు చట్టం
సమావేశంలో మాట్లాడుతున్న అకునూరి మురళి

- ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి

- మాజీ ఐఏఎస్‌ ఆకునూరి మురళి

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, సెప్టెంబరు 23 (ఆంధ్ర జ్యోతి) : రాష్ట్రంలోని సబ్బండ వర్గాలు పోరాడితేనే విద్యాహ క్కు చట్టాన్ని సాధించుకోగలమని మాజీ ఐఏఎస్‌ అధికారి, తెలంగాణ పీపుల్స్‌ ప్రంట్‌ (టీపీఎఫ్‌) నాయకుడు ఆకునూ రి మురళి అన్నారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని ప్రెస్‌ క్లబ్‌లో బుధవారం నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశం లో ఆయన మాట్లాడారు. విద్యాహక్కు చట్టం అమలు చేయకపోవడంతో రాష్ట్రంలో నిరుపేదలు, మధ్య తరగతి పిల్లలకు విద్య అందని ద్రాక్షగా మారిందన్నారు. ప్రత్యేక రా ష్ట్రం ఏర్పడి దశాబ్దం గడిచినా, విద్య వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పాలకులు చర్యలు చేపట్టడం లేదని విమర్శిం చారు. అప్పటి ముఖ్యమంత్రి కేజీ టూ పీజీ ఉచిత విద్య అని, అమలు చేయలేదన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయిస్తామని చెప్పి, కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటించి, నేటికీ మంజూరు చేయడలం లేదన్నారు. విద్యా రంగానికి రాష్ట్ర బడ్టెట్‌లో 18 శాతం నిధులు కేటాయించాలని, ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని కోరారు. ప్రైవేటు పాఠశా లల్లో ఫీజుల నియంత్రణ లేక, పేద, మద్య తరగతి తల్లిదం డ్రులు దోపిడీకి గురవుతున్నారని ఆరోపించారు. ఉపాధ్యా యులు లేక ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించకపోవడంతో వారు నేరాల వైపు ఆకర్షితులవుతు న్నారని వాపోయారు. విద్యాహక్కు చట్టం కోసం టీపీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడ్తామన్నారు. సమావేశంలో మాజీ ఐఏఎస్‌ అధికారి ఎంవీరెడ్డి, చంపాలాల్‌, ప్రొఫెసర్‌ పద్మజపా, రూబీనా, సృజన యాదవ్‌, ముప్పూరి కుమా రన్న, పాలకూరి ఆశోక్‌, తెలంగాణ వ్యవసాయ వృత్తిదారు ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టగళ్ల వెంకటయ్య, నాయకులు నాగన్న, గణిత, పద్మ, కవిత, ఈశ్వరమ్మ, మానస, నరసింహులు, వినోద, రాములు, పరమేశ్వర్‌ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2026 | 12:12 AM