Share News

సభ ఏర్పాట్ల పరిశీలన

ABN , Publish Date - Feb 02 , 2026 | 11:27 PM

బీజేపీ జాతీయ అఽధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ ఈ నెల 4న పాలమూరు రానున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్‌ కళాశాల మైదానంలో కార్యకర్తలు, ఉమ్మడి జిల్లా బూత్‌ కమిటీ సభ్యుల సభను నిర్వహించనున్నారు.

సభ ఏర్పాట్ల పరిశీలన
సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న రామచంద్రరావు

జాతీయ అధ్యక్షుడికి ఘన స్వాగతం పలకాలి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): బీజేపీ జాతీయ అఽధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ ఈ నెల 4న పాలమూరు రానున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్‌ కళాశాల మైదానంలో కార్యకర్తలు, ఉమ్మడి జిల్లా బూత్‌ కమిటీ సభ్యుల సభను నిర్వహించనున్నారు. ఆ సభ ఏర్పాట్లను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సోమవారం పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణతో కలిసి పరిశీలించారు. జాతీయ అధ్యక్షుడు తొలిసారి రాష్ట్రానికి రానున్నందున పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలకాలన్నారు. బుధవారం ఒంటిగంట వరకు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరుకోవాలన్నారు. రాష్ట్రం లో పార్టీ బలోపేతం కోసం నితిన్‌ న బిన్‌ దిశానిర్దేశం చేస్తారన్నారు. యు వత బీజేపీ వైపు చూస్తుందని, తెలంగాణలో పార్టీ అధికామే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. మునిసిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందేలా కార్యకర్తలు పని చేయాలన్నారు. అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందన్నారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్‌ మునిసిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి చింతల రామచంద్రరెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి, సీనాయర్‌ నాయకులు నాగురావు నామాజీ, జిల్లా అధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి, నాయకులు పడాకుల బాలరాజ్‌, రవీందర్‌రెడ్డి, కృష్ణవర్ధన్‌రెడ్డి, అంజయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2026 | 11:27 PM