Share News

రహదారి ఆక్రమణలపై రెవెన్యూ అధికారుల పరిశీలన

ABN , Publish Date - Sep 25 , 2026 | 11:08 PM

అలంపూర్‌ పట్టణంలోని 2009 నాటి వరద బాదితులకు ప్రభుత్వం కేటాయించిన 43ఎకరాల ఇళ్ల స్థలాలకు వెళ్లే 60అడుగుల ప్రధాన రహదారి ఆక్రమణలకు గురవుతోందన్న ఆరోపణలపై రెవెన్యూ అధికారులు స్పందించారు.

రహదారి ఆక్రమణలపై రెవెన్యూ అధికారుల పరిశీలన
టూరిజం హోటల్‌ వద్ద ప్రభుత్వ స్థలాలు, రహదారులను పరిశీలిస్తున్న అధికారులు, నాయకులు

అలంపూర్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): అలంపూర్‌ పట్టణంలోని 2009 నాటి వరద బాదితులకు ప్రభుత్వం కేటాయించిన 43ఎకరాల ఇళ్ల స్థలాలకు వెళ్లే 60అడుగుల ప్రధాన రహదారి ఆక్రమణలకు గురవుతోందన్న ఆరోపణలపై రెవెన్యూ అధికారులు స్పందించారు. శుక్రవారం తహసీల్దార్‌ ప్రభాకర్‌ సమక్షంలో అధికారులు తెలంగాణ టూరిజం కార్యాలయం ముందు ఉన్న రహదారి ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అలంపూర్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ వరద బాధితుల ఇళ్ల స్థలాలకు వెళ్లే 60 అడుగుల ప్రధాన రహదారితో పాటు జోగుళాంబ వాగు పక్కన ఉన్న 30 అడుగుల బఫర్‌ జోన్‌ ప్రభుత్వ పరిధిలోని స్థలాలని తెలిపారు. ప్రభుత్వ స్థలాలు, రహదా రులను ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారుల ను కోరారు. కార్యక్రమంలో ఏడీసీ కమిటీ అధ్యక్షుడు కృష్ణమూర్తి, ఉపాధ్య క్షుడు ఇస్మాయిల్‌, కమిటీ ప్రతినిధులు రజినీబాబు, ముస్తఫా, సురేశ్‌, వెం కట్‌ నారాయణ రెడ్డి, ఆనంద్‌, నాయకులు పెద్దబాబు, రాజు, జాన్‌, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 25 , 2026 | 11:08 PM