కూడళ్ల మరమ్మతు చేపట్టాలి
ABN , Publish Date - Sep 23 , 2026 | 11:32 PM
నగరంలో చౌరస్తాల్లో నెలకొన్న సమస్యలను పరిశీలించి, మరమ్మతు చేపట్టాల ని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ అధి కారులను ఆదేశించారు.
మహబూబ్‌నగర్ అర్బన్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : నగరంలో చౌరస్తాల్లో నెలకొన్న సమస్యలను పరిశీలించి, మరమ్మతు చేపట్టాల ని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ అధి కారులను ఆదేశించారు. బుధవారం నగరంలోని కూడళ్లు, సర్కిళ్లలో ఏర్పాటు చేసిన కళావృత్తు లు, ఫాంటెన్లు, ఆకర్షిణీయ బొమ్మల నిర్వహణ ను పరిశీలించి, 24 గంటల్లో మర్మతులను చేప ట్టాలని మునిసిపల్ కమిషనర్ రామానుజులా రెడ్డికి సూచించారు. సర్కిళ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.