మతోన్మాద పార్టీలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి
ABN , Publish Date - Jan 11 , 2026 | 11:36 PM
బీజేపీ లాంటి మతోన్మాద పార్టీలను మునిసిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పేర్కొన్నారు.
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
అమరచింత, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): బీజేపీ లాంటి మతోన్మాద పార్టీలను మునిసిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పేర్కొన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా అమర చింత సీపీఎం కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై నిరంతరం పో రాడాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని సూచించారు. ఎన్నికల్లో కార్యకర్తలు కష్టపడి పని చేయాలని కో రారు. ఉద్యమాల గడ్డగా ఉన్న అమరచింతలో పొత్తు లేకుండానే 10వార్డుల్లో అ భ్యర్థుల నిలబడి గెలవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు సీపీఎం అభ్యర్థులకు పెద్ద ఎత్తున ఆదరించి గెలిపించాలని కోరారు. మహి మూద్, మండల కార్యదర్శి జీఎస్.గోపి, ఆర్‌ఎన్.రమేష్, ఎస్.అజయ్, వెంకటేశ్, రాజు, రాఘవేంద్ర, శ్యాంసుందర్, బుచ్చన్న, అరుణ్‌కుమార్, రవి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.