Share News

వనపర్తి వైద్య కళాశాలకు అరుదైన గౌరవం

ABN , Publish Date - Apr 07 , 2026 | 11:36 PM

వనపర్తి వైద్య కళాశాలకు రాష్ట్ర స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం పార్ట్‌- 1లో కళాశాల విద్యార్థులు రాష్ట్రంలోనే ఉత్తమ ఉత్తీర్ణతా శాతం సాధించారు.

వనపర్తి వైద్య కళాశాలకు అరుదైన గౌరవం
మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న ప్రిన్సిపాల్‌, ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌

- రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు

- ఆరోగ్య శాఖ మంత్రి చేతుల మీదుగా ప్రిన్సిపాల్‌కు పురస్కారం

వనపర్తి వైద్యవిభాగం, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి) : వనపర్తి వైద్య కళాశాలకు రాష్ట్ర స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం పార్ట్‌- 1లో కళాశాల విద్యార్థులు రాష్ట్రంలోనే ఉత్తమ ఉత్తీర్ణతా శాతం సాధించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ చేతుల మీదుగా వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మల్లికార్జున్‌, జనరల్‌ ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెం డెంట్‌ డాక్టర్‌ అరుణకుమారి పురస్కారం, జ్ఞాపికను అందుకున్నారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి విద్యార్థులు, వైద్యులకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదిగి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అం దించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఎంఈ (డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌) డాక్టర్‌ నరేంద్ర కుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2026 | 11:36 PM