Share News

కాకా టీ-20 లీగ్‌లో రంగారెడ్డి గెలుపు

ABN , Publish Date - Jan 11 , 2026 | 11:34 PM

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీ.వెంకట స్వామి కాకా మెమోరియల్‌ టీ-20 అంతర్‌జిల్లాల క్రికెట్‌ టోర్నీలో రం గారెడ్డి జట్టు విజయం సాధించింది

కాకా టీ-20 లీగ్‌లో రంగారెడ్డి గెలుపు
రంగారెడ్డి జట్టు క్రీడాకారుడు నవనీత్‌రావుకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అందజేస్తున్న హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు బస్వరాజ్‌

- తొమ్మిది వికెట్ల తేడాతో మెదక్‌పై..

- అర్ధసెంచరీలతో రాణించిన క్రీడాకారులు

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీ.వెంకట స్వామి కాకా మెమోరియల్‌ టీ-20 అంతర్‌జిల్లాల క్రికెట్‌ టోర్నీలో రం గారెడ్డి జట్టు విజయం సాధించింది. ఆదివారం జిల్లా కేంద్రంలోని పిల్ల లమర్రి రోడ్డు సమీపంలో గల జిల్లా క్రికెట్‌ సంఘం మైదానంలో జరిగి న మొదటి మ్యాచ్‌ మెదక్‌, రంగారెడ్డి తలబడ్డాయి. టాస్‌ గెలిచి బ్యా టింగ్‌ చేసిన మెదక్‌ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరు గులు చేసింది. జట్టులో రోహిత్‌రెడ్డి 41 పరుగులు, నవీన్‌ అర ్ధసెంచరీ (51) చేశాడు. రంగారెడ్డి బౌలర్లలో సాయిఅక్షత్‌గౌడ్‌ రెండు వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రంగారెడ్డి జట్టు 11.5 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 132 పరుగులు చేసి తొమ్మిది వికెట్ల తేడాతో గెలు పొందింది. నవనీత్‌రావు అర్ధ సెంచరీ (53) సాధించగా, సాత్విక్‌పెద్ది 43, వైష్ణవ్‌రెడ్డి 32 పరుగులు చేశారు. 51 పరుగులు చేసిన జట్టు విజయానికి కృషి చేసిన నవనీత్‌రావు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అందుకున్నాడు.

22 పరుగులతో ఆదిలాబాద్‌ విజయం

మరో మ్యాచ్‌లో ఆదిలాబాద్‌ జట్టు హైదరాబాద్‌పై 22 పరుగుల తే డాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన ఆ దిలాబాద్‌ జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. జట్టులో ఏ.సంతోష్‌ 51 బంతుల్లో 11 ఫోర్లు, ఐదు సిక్స్‌లతో 97 పరుగులు చేశాడు. మహ్మద్‌ అర్మన్‌ 39 పరుగులు చేశారు. హైదరాబాద్‌ జట్టు బౌలర్లలో లోకత్‌యాదవ్‌ రెండు వికెట్ల తీశాడు. అనంతరం బ్యాటింగ్‌ దిగిన హైదరాబాద్‌ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసి ఓటమి పాలైంది. జట్టులో కానిష్‌కాంత్‌రెడ్డి 49, వినిత్‌ పవర్‌ 25, బాలజీ 29 పరుగులు చేశారు. ఆదిలాబాద్‌ బౌలర్లలో వినయ్‌ రెండు వికెట్ల తీశాడు.

Updated Date - Jan 11 , 2026 | 11:34 PM