బలిచ్చేందుకు పొట్టేళ్లు సిద్ధం
ABN , Publish Date - Oct 17 , 2026 | 11:30 PM
నారాయణపేట జి ల్లా వ్యాప్తంగా ఆదివారం దుర్గాష్టమి వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకోనున్నారు. అయితే, నారాయణపేటలో జరిగే వేడుకలకు ఓ ప్రత్యేకత సంతరించుకుంది.
- నేడు దుర్గాష్టమి వేడుకలు
- నారాయణపేట జిల్లాలో విశిష్టత పొందిన ‘పేట’ దుర్గాష్టమి వేడుకలు
- కర్ణాటక రాష్ట్రం అమీన్ఘడ్ నుంచి పొట్టేళ్ల దిగుమతి
నారాయణపేట, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జి ల్లా వ్యాప్తంగా ఆదివారం దుర్గాష్టమి వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకోనున్నారు. అయితే, నారాయణపేటలో జరిగే వేడుకలకు ఓ ప్రత్యేకత సంతరించుకుంది. మిగతా ప్రాంతాలవారు పంచభక్ష వం టకాలతో ఈ పండుగను నిర్వహిస్తుండగా, ప్రధానంగా పలు వర్గా లకు చెందినవారు పదకొండు, తొమ్మిది, మూడ్రోజుల పాటు ప్రత్యేకంగా ఈ ఉత్సవాలను నిర్వహించుకోవడం గతం నుంచి సంప్రదా య బద్దంగా వస్తోంది. దుర్గాష్టమిని పురస్కరించుకొని ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారు జాము వరకు భక్తులు తమతమ ఇళ్లలో అమ్మవారికి పొట్టేళ్ల (గొర్రెలు)ను బలివ్వడం ఆనవాయితీగా వస్తున్నది. ఇందులో భాగంగానే పొట్టేళ్ల వధతోనే అ మ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. పూర్వీకుల నుంచి వంశపారం పర్యంగా దుర్గాష్టమి రోజున పొట్టేళ్లు పూజించి నవమి వేకువ జాము న బలిస్తూ వంటకాలను వండి భుజించడం ఆనవాయితీ. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైనా, తమ ఇళ్లలో అనాదిగా వస్తున్న ఆచారాన్ని మాత్రం తూచ తప్పకుండా కొనసాగించడం విశేషం. ఆయా వర్గా లు ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించుకుంటారు.
అమీన్ఘడ్ నుంచి గొర్రెల దిగుమతి
కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోట్ జిల్లా అమీన్ఘడ్ గ్రామం పొట్టేళ్ల పెంపకానికి ప్రసిద్ధి. అక్కడి పెంపకం దారులు పొట్టేళ్ల ను మేతకోసం పంపించకుండా ప్రత్యేకంగా దాణవేయడం, జెర్షి ఆవుపాలు తాగించడం, కోడిగుడ్లను తినిపిస్తూ ఏడాది పాటు పొట్టేళ్లను పోషిస్తారు. ఈ విధమైన పొట్టేళ్లు పరిపుష్టిగా తయా రై ఒక్కొక్కటి 30 నుంచి 45 కిలోల బరువు తూగుతాయి. ఒక్కొ క్క పొట్టేలు ధర రూ. 18వేల నుంచి రూ. 90 వేల వరకు పలుకుతోంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పొట్టేళ్ల ధరలు 20 శాతం పెరిగాయని కొనుగోలుదారులు తెలిపారు. నారాయణపేట నుంచి 325 కి.మీ. దూరంలోని అమీన్ఘడ్ గ్రామంలో ప్రతీ శనివారం జరిగే గొర్రెల సంతకు పరిసర ప్రాంతాల ప్రజలతో పాటు రాష్ట్రం నుంచి ప్రజలు కొనుగోలు కోసం పెద్దఎత్తు న తరలి వెళ్తుంటారు. ఈ ప్రాంతంలోని పొట్టేళ్లు రూ.10 వేల నుంచి రూ.40 వేల ధర పలుకుతున్నాయి. ఇప్పటికే నారాయణ పేట, జాజాపూర్, కోటకొండ గ్రామాల నుంచి పలువురు అమీన్ ఘడ్కు వెళ్లి పొట్టేళ్లను కొనుగోలు చేసుకున్నట్లు తెలిసింది.