Share News

డీఐఈఓగా రమణి

ABN , Publish Date - Apr 18 , 2026 | 10:59 PM

మహబూబ్‌నగర్‌ డీఐఈవో(ఇంటర్మీడియట్‌ విద్య జిల్లా అధికారి)గా సి.రమణిని ని యమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఆమె బాధ్యతలు చేపట్టారు. రమణి యాదాద్రి భువనగిరి జి ల్లాలోని భవనగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తూ, ఇక్కడికి వచ్చారు.

డీఐఈఓగా రమణి
కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న డీఐఈఓ రమణి

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం/మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌ డీఐఈవో(ఇంటర్మీడియట్‌ విద్య జిల్లా అధికారి)గా సి.రమణిని ని యమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఆమె బాధ్యతలు చేపట్టారు. రమణి యాదాద్రి భువనగిరి జి ల్లాలోని భవనగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తూ, ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా డీఐఈ వో కార్యాలయ సిబ్బంది, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు ఆమెకు పుష్పగుచ్ఛం అందించి, శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ఇంటర్మీడియట్‌ విద్యాభివృద్ధికి కృషి చేస్తానని రమణి చెప్పారు.

ఫ జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారిగా బాధ్యతలు చేపట్టిన సి.రమణి శనివారం కలెక్టర్‌ ఖుష్భూ గుప్తాను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో ఇంటర్‌ విద్య ప్రమాణాలు పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ సూచించారు.

Updated Date - Apr 18 , 2026 | 11:00 PM