రామలింగేశ్వ స్వామి జాతర ప్రారంభం
ABN , Publish Date - Sep 06 , 2026 | 11:48 PM
మండలంలోని పులిమామిడి గ్రామంలో వెలిసిన రామలింగేశ్వర స్వామి జాతర ఆదివారం ప్రారంభమైంది.
- 9న స్వామి వారి రథోత్సవం
ఊట్కూర్, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని పులిమామిడి గ్రామంలో వెలిసిన రామలింగేశ్వర స్వామి జాతర ఆదివారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు ఉత్సవాల్లో భాగంగా మెదటిరోజు ఉదయం 12 గంటలకు గ్రామంలోని ఆలయం వద్ద ఉన్న బావి నుంచి జల్ది బిందె నీళ్లను గుట్టపై ఉన్న స్వామి వారి ఆలయానికి డప్పు వాయిద్యాలతో దారి పొడవున భజన చేస్తూ తీసుకొచ్చి అభిషేకంగా చేసి పూజలు నిర్వహించారు. అనంతరం స్వా మి వారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై గ్రామ పుర వీఽధుల గుండా భజనలు చేస్తూ ఆలయం వర కు ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ కమి టీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.