శాంతి సామరస్యాలకు ప్రతీక రంజాన్
ABN , Publish Date - Mar 21 , 2026 | 11:24 PM
రంజాన్ పండుగ శాంతి సామరస్యాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవించడానికి దోహదపడుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
- ప్రత్యేక ప్రార్థనల్లో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): రంజాన్ పండుగ శాంతి సామరస్యాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవించడానికి దోహదపడుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఈద్ పర్వదినాన్ని పురష్కరించుకొని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలో కలెక్టర్ పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... సేవాభావాన్ని, దానగుణాన్ని పెంపొందించే పవిత్ర మాసమని అన్నారు. హిందువులు, ముస్లింలు సహా అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి సక్యతతో జీవించాల న్నారు. సమాజంలో ఐక్యత, సామరస్యాన్ని కాపాడాలని సూచించారు. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈద్గా వద్దకు వచ్చిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. నెల రోజుల పాటు ముస్లింలు ఉపవాస దీక్షల ఫలితంగా అల్లా దీవెనలతో ప్రపంచశాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. అన్ని కులాలు, మతాలు సరస్పరం గౌరవించుకుంటూ జీవించేందుకు రంజాన్ పర్వదినం ఉపకరిస్తుందన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌ను, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని పలువురు ముస్లిం పెద్దలు సత్కరించారు. ఎమ్మెల్యే వెంట మునిసిపల్ చైర్‌పర్సన్ తుమ్మల జయలక్ష్మి, వైస్ చైర్మన్ శంకర్, పలువురు నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు.