ప్రభుత్వ పాఠశాలలోకి వర్షపు నీరు
ABN , Publish Date - Jun 14 , 2026 | 11:49 PM
మండల పరిధిలోని గంగన్‌పల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోకి వర్షపు నీరు చేరింది.
కేటీదొడ్డి, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని గంగన్‌పల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోకి వర్షపు నీరు చేరింది. శనివారం రాత్రి కురిసిన వర్షానికి ఈ పరిస్థితి ఏర్పడిం దని గ్రామస్థులు తెలిపారు. పాఠశాల ముందు సీసీ రోడ్డును ఎత్తుగా వేయడం వల్లనే వర్షపు నీరంతా పాఠశాల ఆవరణలో చేరిందని పేర్కొన్నారు. సోమవారం పాఠశాలలు ప్రారంభం కానుండడంతో ఇక్కడ తరగతుల నిర్వహ ణ ఎలా సాధ్యపడుతుందని చర్చించు కుంటున్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించి, సమస్యను వెంటనే పరిష్కరించాలని విద్యార్థు లు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.