Share News

ఇలపై హరివిల్లు

ABN , Publish Date - Jan 03 , 2026 | 11:38 PM

ఇలపై హరివిల్లు పరుచుకుంది. సంక్రాంతికి ముందే మహబూబ్‌నర్‌కు పండగొచ్చింది. ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని మాడ్రన్‌ హైస్కూల్‌లో ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు, యువతులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని, రంగు రంగుల ముగ్గులు వేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఇలపై హరివిల్లు
మహబూబ్‌నగర్‌లోని మాడ్రన్‌ హైస్కూల్‌ ఆవరణలో ముగ్గులు వేస్తున్న మహిళలు, యువతులు, విద్యార్థినులు

కోలాహలంగా ‘ఆంధ్రజ్యోతి’ ముత్యాల ముగ్గుల పోటీలు

పోటీ పడి ముగ్గులు వేసిన మహిళలు, యువతులు

పూర్వీకులు నేర్పిన సంప్రదాయాల వల్లే సంస్కారం : డీఈవో ప్రవీణ్‌ కుమార్‌

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): ఇలపై హరివిల్లు పరుచుకుంది. సంక్రాంతికి ముందే మహబూబ్‌నర్‌కు పండగొచ్చింది. ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని మాడ్రన్‌ హైస్కూల్‌లో ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు, యువతులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని, రంగు రంగుల ముగ్గులు వేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ నిర్వహిస్తున్న సం తూర్‌ ముత్యాల ముగ్గుల పోటీలు.. పవర్డ్‌ బై సన్‌ఫీ్‌స్ట మామ్స్‌ మ్యాజిక్‌ బిస్కెట్‌, టేస్ట్‌ పార్టనర్‌ స్వస్తిక్‌ మసాలా, ప్రేయర్‌ పార్టనర్‌ పరిమళ్‌ మందిర్‌ భారత్‌వాసి అగరబత్తీ పేరిట ఈ పోటీలను ఏర్పాటు చేశారు. బ్యూరో ఇన్‌చార్జి నోముల రవీందర్‌ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో డీఈఓ ప్రవీణ్‌కుమార్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పూర్వీకులు నేర్పిన సంప్రదాయాల వల్లే మనకు నేడు సం స్కారం అలవడుతుందని అన్నారు. ముగ్గులు వేయడం ఎంతో కళాత్మకతతో కూడిన అంశమన్నారు. సృజనాత్మకతను వెలికి తీసేందుకు ముగ్గులు దోహదం చేస్తాయన్నారు. విశిష్ట అతిథి బీసీ వెల్ఫేర్‌ జిల్లా అధికారి ఇందిర మాట్లాడుతూ మహిళల చదువుల తల్లి సావిత్రి బాయి ఫూలే జయంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఏఎంవో దుంకుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ ముగ్గులు వేయడం ద్వారా మహిళలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. గీతం పాఠశాల కరస్పాండెంట్‌ సుధారాణి మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పోటీల్లో గెలుపోందిన విజేతలకు డీఈవో, బీసీ వెల్ఫేర్‌ అధికారి, బ్యూరో ఇన్‌చార్జి, బ్రాంచ్‌ మెనేజన్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, ఎడిషన్‌ ఇన్‌చార్జి అలువాల తిరుపతయ్య, ఏబీఎన్‌ కరస్పాండెంట్‌ బస్వరాజు, ఏసీఎం చందు, ప్రింటింగ్‌ ఇన్‌చార్జి అనూప్‌ పాటిల్‌ బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో గీతం పాఠశాల ప్రిన్సిపాల్‌ కృష్ణ, మాడ్రన్‌ బెసిక్‌ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్‌ దత్తు, సీఎంవో సుధాకర్‌ రెడ్డి, న్యా య నిర్ణేతలు కవిత, రజిత, ఆంధ్రజ్యోతి మహబూబ్‌నగర్‌ ఇన్‌చార్జి నరేందర్‌ గౌడ్‌, ఏబీఎన్‌ వీడియో జర్నలిస్టు సంతోష్‌, ఆంధ్రజ్యోతి ఫొటో గ్రాఫర్‌ రవి, రిపోర్టర్లు శేఖర్‌, శంకర్‌ నాయక్‌, విష్ణు, టప్ప శ్రీశైలం, వెంకటయ్య, మక్భుల్‌ పాషా, మహేష్‌, రఘు పాల్గొన్నారు.

విజేతలు వీరే..

ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతిని శిల్ప దక్కించుకున్నారు. ద్వితీయ బహుమతి శుభాంగి, తృతీయ బహుమతి నునిత కైవసం చేసుకున్నారు. ప్రథమ బహుమతిగా రూ.6 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.4 వేలు, తృతీయ బహుమతిగా రూ.3 వేలతో పాటు అందరికీ ప్రోత్సాహక బహుమతులను అందించారు. వీరితో పాటు మరో ముగ్గురుకి కన్సోలేషన్‌ బహుమతులు ఇచ్చారు. శ్రీలక్ష్మీ, శ్రీలత, వాసంతి వాటిని అందుకున్నారు. పోటీల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందించారు.

Updated Date - Jan 03 , 2026 | 11:38 PM