Share News

ఎయిర్‌పోర్టులకు దీటుగా రైల్వే స్టేషన్లు

ABN , Publish Date - Aug 31 , 2026 | 11:20 PM

గద్వాల రైల్వేస్టేషన్‌ను ప్రత్యేకహబ్‌ గా గుర్తించాం. ఇక్కడ నుంచి ప్రతీరోజు 34 రైళ్లలో 7వేల మంది ప్రయాణం చేస్తున్నారు.

ఎయిర్‌పోర్టులకు దీటుగా రైల్వే స్టేషన్లు
గద్వాల రైల్వే స్టేషన్‌ను పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

- హైస్పీడ్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌తో త్వరగా గమ్యస్థానం

- గద్వాల రైల్వేస్టేషన్‌ను ప్రత్యేక హబ్‌గా గుర్తించాం

- ప్రతీ రోజు 34 రైళ్లలో 7వేల మంది ప్రయాణం

- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

గద్వాల/ఉండవల్లి, ఆగస్టు 31 (ఆంధ్ర జ్యోతి): గద్వాల రైల్వేస్టేషన్‌ను ప్రత్యేకహబ్‌ గా గుర్తించాం. ఇక్కడ నుంచి ప్రతీరోజు 34 రైళ్లలో 7వేల మంది ప్రయాణం చేస్తున్నారు. అందుకే అమృత్‌ భారత్‌ పథకం కింద ఎయిర్‌పోర్ట్‌లకు దీటుగా అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన గద్వా ల, జోగుళాంబ రైల్వే స్టేషన్‌లలో చేపడుతున్న అభివృ ద్ధి పనులను ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. గద్వాల రైల్వే స్టేషన్‌లో రూ.43కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. వచ్చే ఏప్రిల్‌ నాటికి పనులు పూ ర్తి చేసి శతాబ్ధి ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపా రు. కేంద్రం రైల్వేశాఖ మంత్రితో మాట్లాడి వందేభారత్‌ రైలుకు ఇక్కడ స్టాప్‌ ఏర్పాటు చేయించేందుకు కృషి చే స్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా గద్వాల రెండో రైల్వే గేటు వద్ద రూ.66కోట్లతో ఆర్వోబీని నిర్మిస్తామని తెలిపారు. బుల్లెట్‌ రైళ్లకు హైస్పీడ్‌ ఎలివేటర్‌ కారిడార్‌ లు వస్తే త్వరగా గమ్యస్థానం చేరుకోవచ్చని, దీని వల న పర్యాటకుల సంఖ్య పెరగడంతో పాటు తెలంగాణ కు పెట్టుబడులు వస్తాయని వివరించారు. ప్రధానమం త్రి నరేంద్ర మోదీ 12ఏళ్ల పాలనలో రైల్వేశాఖ శరవేగంగా అభివృద్ధ్ది చెందుతోందని వివరించారు. ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ... డోర్నకల్‌-గద్వాల, గద్వాల- మాచర్ల రైల్వే లైన్‌ నిర్మాణంపై పరిశీలన చేయాలని కోరారు. గద్వాల రైల్వే స్థలంలో రైల్వేకు సంబంధించిన ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. జరీచీరలకు గద్వాల ప్రసద్ధి.. ఇక్కడకు వచ్చే వ్యాపారు లు సౌకర్యార్థం అన్ని రైళ్లను ఆపాలని కోరారు.

అంతకుముందు జోగుళాంబ రైల్వే స్టేషన్‌ను పరిశీలిం చిన మంత్రి కిషన్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన అమృత్‌భారత్‌ పథకం కింద రూ.6.7కోట్లతో జోగుళాంబ స్టేషన్‌ను అభివృద్ధి చే శామని, త్వరలో డబుల్‌ లైన్‌తోపాటు రెండో ఫ్లాట్‌ఫాం నిర్మిస్తామని తెలిపారు. రూ.37కోట్ల ప్రసాద్‌ స్కీం ని ధులతో అలంపూరు పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేశామన్నా రు. అదేవిధంగా ఆర్‌వోబీ నిర్మాణం కోసం రూ.45 కో ట్లు విడుదల చేస్తున్నట్లు ఉండవల్లి రైతుసంఘం స మక్షంలో మంత్రి ప్రకటించారు. రైల్వే స్టేషన్‌లో ఏర్పా టు చేసిన ఓ స్టాల్‌లో బఠానీలు కొనుగోలు చేశారు. కార్యక్రమంలో దక్షిణమధ్య రైల్వే హైదరాబాద్‌ డివిజన్‌ (డీఆర్‌ఎం)సంతోష్‌కుమార్‌వర్మ, కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ , మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ జయలక్ష్మి, వైస్‌ చైర్మన్‌ శంకర్‌, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, నాయకు లు భరత్‌ ప్రసాద్‌, డీకే స్నిగ్ధారెడ్డి, రామాంజనేయులు, రామచంద్రారెడ్డి, పోతుగంటి భరత్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2026 | 11:20 PM