రాహుల్ గాంధీ అరెస్టు అప్రజాస్వామికం
ABN , Publish Date - Jul 22 , 2026 | 11:22 PM
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ అరెస్టుకు నిరసనగా బుధవారం నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
- అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ
- పేపర్‌లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర
విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
- గద్వాల డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి
అచ్చంపేట/గద్వాల టౌన్, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ అరెస్టుకు నిరసనగా బుధవారం నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అచ్చంపేట పట్టణంలో ఎమ్మెల్యే వంశీ కృష్ణ, గద్వాల పట్టణంలో డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డిల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లా డుతూ నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులపై లాఠీచార్జి చేయించడం, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీని అక్రమంగా అరెస్టుచేయడం అప్రజాస్వామికమని అన్నారు. నీట్ పరీక్షలో జరిగిన అక్ర మాలపై సమగ్ర దర్యాప్తు జరిపి బాఽధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గద్వాల పట్టణంలోని పా త బస్టాండ్ సర్కిల్‌లో గద్వాల డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దొష్టిబొమ్మను దహనం చేశా రు. ఈ సందర్భంగా రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి సిద్ధేశ్వర్, గద్వాల ఇన్‌చార్జి శ్రీనివాస్‌గౌడ్, మునిసిపల్ చైర్‌పర్సన్ తుమ్మల జయలక్ష్మి, నాయకులు ఉన్నారు.