అరెస్టులతో రాహుల్‌గాంధీని అడ్డుకోలేరు
ABN , Publish Date - Jul 22 , 2026 | 11:42 PM
అరెస్టులతో విద్యార్థులను, రాహుల్‌గాంధీని అడ్డుకోలేరని దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి
చిన్నచింతకుంట, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : అరెస్టులతో విద్యార్థులను, రాహుల్‌గాంధీని అడ్డుకోలేరని దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని లాల్‌కోట చౌరస్తాలో రాహుల్‌గాంధీ అరెస్టు చేయటాన్ని నిరసిస్తూ కార్యకర్తలతో కలిసి రాయచూర్, హైదరాబాద్ రహదారిపై బైఠాయించి రాస్తారోకోలో పాల్గొని, మాట్లాడారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యార్థులపై లాఠీచార్జి చేయటం, టియర్‌గ్యాస్ ప్రయోగించటం అమానుషం అన్నారు. దీనికి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖామంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు అరవింద్‌కుమార్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు వెంకటేష్, గోవర్ధన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, భరత్, దామోదర్, శేఖర్ పాల్గొన్నారు. అంతకుముందు మాదాసి, మాదారి కురువలకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని కోరుతూ ఆ సంఘం నాయకులు ఎమ్మెల్యేకు ఆయన నివాసంలో వినతి పత్రం అందజేశారు.
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
జడ్చర్ల : పట్టణంలోని సిగ్నల్‌గడ్డ చౌరస్తా వద్ద బుధవారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దహనం చేశారు. ఢిల్లీలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ అధినేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీతో పాటు విద్యార్థులు, కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసినట్లు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వంశీచారి తెలిపారు. బాదేపల్లి మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ రాజేందర్‌గౌడ్, నాయకులు వెంకటేశ్, అశోక్‌యాదవ్, నిత్యానందం, యాదయ్య, వంశీధర్‌రెడ్డి, రమేశ్, సాయిరెడ్డి, గోపాల్‌యాదవ్, ప్రీతమ్, ఆనంద్ పాల్గొన్నారు.